సినీనటి చౌరాసియాపై దాడి : మిస్టరీని ఛేదించిన పోలీసులు.. నిందితుడు అరెస్ట్
Send us your feedback to audioarticles@vaarta.com
హైదరాబాద్ కేబీఆర్ పార్క్‌లో వర్థమాన సినీనటి షాలు చౌరాసియాపై దాడి ఘటన కలకలం రేపిన సంగతి తెలిసిందే. అయితే చాకచక్యంగా నిందితుడ్ని పట్టుకొని, పోలీసులు కేసును చేధించారు. ఈ నేరానికి పాల్పడింది బాబు అనే వ్యక్తిగా తేల్చారు. దాడి చేయడం వెనుక నిందితుడి ఉద్దేశం ఏమిటన్నది పోలీసులు విచారిస్తున్నారు.
కాగా.. నవంబర్ 14 ఆదివారం రాత్రి ఎనిమిది గంటల ప్రాంతంలో సినీనటి చౌరాసియా వాకింగ్ కోసం కేబీఆర్ పార్క్‌కి వచ్చారు. ఔటర్ ట్రాక్‌పై వాకింగ్ చేస్తున్న ఆమెపై ఎక్కడి నుంచి వచ్చాడో తెలియదు గానీ ఓ దుండగుడు దాడికి దిగాడు. అసభ్యంగా ప్రవర్తించడంతో పాటు ఆమెను పక్కనే ఉన్న పొదల్లోకి లాక్కెళ్లాడు. ఈ హఠాత్పరిణామంతో షాక్‌కి గురైన ఆమె వెంటనే తేరుకుని ప్రతిఘటించారు. ఈ క్రమంలో చౌరాసియాకు తీవ్ర గాయాలయ్యాయి.
దాడి అనంతరం చౌరాసియా వద్ద వున్న ఆపిల్ ఫోన్ లాక్కొని నిందితుడు పారిపోయాడు. దీనిపై సమాచారం అందుకున్న పోలీసులు.. కేసును సీరియస్‌గా తీసుకున్నారు. బృందాలుగా ఏర్పడి నిందితుడి కోసం గాలింపు చేపట్టారు. పార్క్ పరిసర ప్రాంతాల్లోని సీసీ ఫుటేజ్ ఆధారాలతో పాటు, పాత నేరస్థులను విచారించడం జరిగింది. ఈ క్రమంలోనే హైదరాబాద్ కృష్ణానగర్‌కి చెందిన 60 మంది నేరస్థుల గురించి ఆరా తీశారు. చిత్ర పరిశ్రమతో సంబంధాలున్న నేరస్థులపై కూడా నిఘా పెట్టారు. ఎట్టకేలకు పోలీసుల శ్రమ ఫలించి బాబు అనే వ్యక్తి .. చౌరాసియాపై దాడికి దిగినట్లుగా గుర్తించి అతనిని అదుపులోకి తీసుకున్నారు.
Follow @ Google News: గూగుల్ న్యూస్ పేజీలోని ఇండియాగ్లిట్జ్ తెలుగు వెబ్‌సైట్‌ను అనుసరించడానికి మరియు వెంటనే వార్తలను తెలుసుకోవడాని ఇక్కడ క్లిక్ చేయండి.
-
Devan Karthik
Contact at support@indiaglitz.com
Comments