మెట్రో స్మార్ట్ కార్డు ధరెంతో తెలుసా ?
Send us your feedback to audioarticles@vaarta.com
3 కారిడార్లలో నిర్మిస్తున్న మెట్రో రైల్ ప్రాజెక్ట్ హైదరాబాద్ నగరానికి తలమానికం కానుంది. నాగోల్ - మెట్టుగూడ 8 కిలో మీటర్ల మార్గం రెండేళ్ల క్రితమే పూర్తయ్యింది. ప్రస్తుతం నాగోల్ - అమీర్ పేట్, మియాపూర్ - అమీర్ పేట్ మార్గాలు పూర్తి అయ్యి ప్రారంభానికి సిద్ధంగా ఉన్నాయి. నవంబర్ 28 న ప్రధాన మంత్రి మోదీ చేతుల మీదుగా ప్రారంభం చేయించడానికి రాష్ట్ర ప్రభుత్వం సన్నాహాలు చేస్తోంది.
ఇదిలా ఉంటే, మెట్రో స్మార్ట్‌కార్డు కనీస ధర రూ.200 ఉండే అవకాశం ఉందని తెలిసింది. దీనిలో రూ.100 కార్డు ధర కాగా మరో రూ.100 రీచార్జ్ కింద లెక్కిస్తారట. ఒకేసారి రూ.2,000 వరకు రీచార్జ్ చేసుకొనే సదుపాయాన్ని కల్పిస్తున్నారట. ఈ స్మార్ట్ కార్డులను మియాపూర్ - నాగోల్ రూట్లలో ఉన్న స్టేషన్లలో విక్రయించటంతో పాటు, ఆన్లైన్లో కొనుగోలు చేసేందుకు ఓ వెబ్‌సైట్‌ను కూడా సిద్ధం చేస్తున్నట్లు తెలిసింది.
Follow @ Google News: గూగుల్ న్యూస్ పేజీలోని ఇండియాగ్లిట్జ్ తెలుగు వెబ్‌సైట్‌ను అనుసరించడానికి మరియు వెంటనే వార్తలను తెలుసుకోవడాని ఇక్కడ క్లిక్ చేయండి.
Comments
- logoutLogout
-
Contact at support@indiaglitz.com