Hyderabad Metro : మీరు రెగ్యులర్‌గా మెట్రోలో ప్రయాణిస్తారా.. అయితే మీకు ‘‘బోనస్’’, ఈ ఐడీల వారికే...!!

  • IndiaGlitz, [Friday,November 25 2022]

హైదరాబాద్ మెట్రో రైలు ప్రయాణీకులకు మెరుగైన సేవలు అందిస్తోంది. కరోనాకు ముందు ప్రతినిత్యం లక్షల్లో ప్రయాణీకులను గమ్యస్థానాలకు సేవలందించిన మెట్రోకు... కోవిడ్ కారణంగా కోలుకోలేని దెబ్బ తగిలింది. వరుస లాక్‌డౌన్‌లకు తోడు.. మహారాజ పోషకుల్లాంటి ఐటీ ఉద్యోగులకు వర్క్ ఫ్రమ్ హోమ్ అమలు కావడంతో హైదరాబాద్ మెట్రో వెలవెలబోయింది. దీంతో తమను ఆదుకునేందుకు ప్రభుత్వం చొరవ చూపాలని మెట్రో యాజమాన్యం కోరింది. అయితే తర్వాత కోవిడ్ తగ్గుముఖం పట్టడం, కార్యాలయాలు తెరుచుకోవడంతో మెట్రో మునుపటి ఫామ్‌ని అందుకుంది.

హైదరాబాద్ మెట్రోకు ఐదేళ్లు :

ఇదిలావుండగా.. మెట్రోని ఏళ్లుగా ఉపయోగిస్తున్న వారికి హైదరాబాద్ మెట్రో గుడ్‌న్యూస్ చెప్పింది. మెట్రోను ప్రారంభించి ఐదేళ్లు గడుస్తున్న సందర్భంగా లాయల్టీ ప్రోగ్రామ్‌లో భాగంగా లాయల్టీ బోనస్ ప్రకటించింది. దీనికి సంబంధించి విశ్వసనీయ ఖాతాదారుల పేరుతో కొన్ని స్మార్ట్ కార్డ్ ఐడీల లిస్టును విడుదల చేసింది. మెట్రో అధికారులు విడుదల చేసిన ఈ ఐడీలలో ఏదైనా మీ దగ్గర వుంటే.. దగ్గరలోని మెట్రో స్టేషన్‌లో సంప్రదించాలని తెలిపింది.

ఆ ఐడీలు ఏంటంటే:

10100003890119, 101000010715659, 10100001417850, 10100004374980, 10100000006433, 10100001930276, 10100002449022, 101000011214385, 10100002975875 మీ ఐడీ నెంబర్ ఇందులో ఉంటే.. మీకు లాయల్టీ బోనస్ వచ్చినట్లే. మరి ఇంకేందుకు లేటు.. వెంటనే చెక్ చేసుకోండి మరి. మీ వివరాలను నవంబర్ 28వ తేదీ మధ్యాహ్నం ఒంటిగంట లోపు పంపించాలని మెట్రో అధికారులు పేర్కొన్నారు. ఈ ఐడీలను కాల్ లేదా వాట్సాప్ ద్వారా తెలియజేయవచ్చని తెలిపారు.