ఫిబ్రవరి 23 న విడుదలవుతున్న 'హైదరాబాద్ లవ్ స్టోరీ'
Send us your feedback to audioarticles@vaarta.com
తెలుగు సినిమాలో లవ్ స్టోరీలు సర్వసాధారణం కానీ ఈ లవ్ స్టోరీ కి ఓ ప్రత్యేకత ఉంది. ఇది డిఫరెంట్ కాన్సెప్ట్ తో హైదరాబాద్ అందాలతో రొమాంటిక్ సన్నివేశాలతో స్నేహానికి ప్రేమకి మంచి అర్ధం చెప్పే సినిమా ఈ హైదరాబాద్ లవ్ స్టొరీ. రాహుల్ రవీంద్రన్ , రేష్మీ మీనన్ మరియు జియ హీరో హీరోయిన్లు గా రాజ్ సత్య దర్శకత్వం లో ఏం.ఏల్ రాజు, ఆర్.ఏస్ కిషన్, వేణు గోపాల్ కొదుమగుళ్ళ సంయుక్తం గా సినిమా పీపుల్` పతాకం పై నిర్మించబడుతున్న సినిమా “హైదరాబాద్ లవ్ స్టొరీ”
ఈ చిత్రం భారీ అంచనాలతో ఈ నెల అంటే ఫిబ్రవరి 23 న బ్రహ్మాండమైన విడుదల.
ఈ సందర్భంగా దర్శకులు రాజ్ సత్య మాట్లాడుతూ " ఇది ఒక రొమాంటిక్ ఎంటర్టైనర్ చిత్రం. ఒక డిఫరెంట్ కాన్సెప్ట్ తో హైదరాబాద్ అందాలతో మంచి ఫీల్ గుడ్ సన్నివేశాలతో ప్రేమ కి స్నేహానికి మంచి అర్ధం చెప్పే సినిమా. యూత్ మరియు ఫామిలీ ఆడియన్స్ తప్పక చూడదగ్గ చిత్రం హైదరాబాద్ లవ్ స్టొరీ. సునీల్ కశ్యప్ మంచి సంగీతం అందించారు. పాటలు మంచి ప్రేక్షకాదరణ పొందాయి అలాగే సినిమా కూడా అందరికి నచ్చుతుంది. నిర్మాతలు ఏం.ఏల్ రాజు, ఆర్.ఏస్ కిషన్, వేణు గోపాల్ కొదుమగుళ్ళ రాజీ పడకుండా నిర్మించారు. ఈ నెల 23 న విడుదలవుతుంది".
నిర్మాతలు మాట్లాడుతూ " సినిమా చాలా బాగా వచ్చింది. రాజ్ సత్య అద్భుతంగా చిత్రీకరించారు. రాహుల్ రవీంద్రన్ నటన, హీరోయిన్ల గ్లామర్, సునీల్ కశ్యప్ సంగీతం, రావు రమేష్ గారి నటన మా చిత్రానికి మంచి హైలైట్ గా నిలుస్తుంది. ఈ నెల 23న అత్యధిక థియేటర్స్ లో విడుదల చేస్తున్నాము. తెలుగు ప్రేక్షకులకు నచ్చే సినిమా మా `హైదరాబాద్ లవ్ స్టొరీ”.
Follow @ Google News: గూగుల్ న్యూస్ పేజీలోని ఇండియాగ్లిట్జ్ తెలుగు వెబ్‌సైట్‌ను అనుసరించడానికి మరియు వెంటనే వార్తలను తెలుసుకోవడాని ఇక్కడ క్లిక్ చేయండి.
-
Contact at support@indiaglitz.com
Comments