ఫిబ్రవరి 23 న విడుదలవుతున్న 'హైదరాబాద్ లవ్ స్టోరీ'

  • IndiaGlitz, [Thursday,February 22 2018]

తెలుగు సినిమాలో లవ్ స్టోరీలు సర్వసాధారణం కానీ ఈ లవ్ స్టోరీ కి ఓ ప్రత్యేకత ఉంది. ఇది డిఫరెంట్ కాన్సెప్ట్ తో హైదరాబాద్ అందాలతో రొమాంటిక్ సన్నివేశాలతో స్నేహానికి ప్రేమకి మంచి అర్ధం చెప్పే సినిమా ఈ హైదరాబాద్ లవ్ స్టొరీ. రాహుల్ రవీంద్రన్ , రేష్మీ మీనన్ మరియు జియ హీరో హీరోయిన్లు గా రాజ్ సత్య దర్శకత్వం లో ఏం.ఏల్ రాజు, ఆర్.ఏస్ కిషన్, వేణు గోపాల్ కొదుమగుళ్ళ సంయుక్తం గా సినిమా పీపుల్' పతాకం పై నిర్మించబడుతున్న సినిమా “హైదరాబాద్ లవ్ స్టొరీ”

ఈ చిత్రం భారీ అంచనాలతో ఈ నెల అంటే ఫిబ్రవరి 23 న బ్రహ్మాండమైన విడుదల.

ఈ సందర్భంగా దర్శకులు రాజ్ సత్య మాట్లాడుతూ " ఇది ఒక రొమాంటిక్ ఎంటర్టైనర్ చిత్రం. ఒక డిఫరెంట్ కాన్సెప్ట్ తో హైదరాబాద్ అందాలతో మంచి ఫీల్ గుడ్ సన్నివేశాలతో ప్రేమ కి స్నేహానికి మంచి అర్ధం చెప్పే సినిమా. యూత్ మరియు ఫామిలీ ఆడియన్స్ తప్పక చూడదగ్గ చిత్రం హైదరాబాద్ లవ్ స్టొరీ. సునీల్ కశ్యప్ మంచి సంగీతం అందించారు. పాటలు మంచి ప్రేక్షకాదరణ పొందాయి అలాగే సినిమా కూడా అందరికి నచ్చుతుంది. నిర్మాతలు ఏం.ఏల్ రాజు, ఆర్.ఏస్ కిషన్, వేణు గోపాల్ కొదుమగుళ్ళ రాజీ పడకుండా నిర్మించారు. ఈ నెల 23 న విడుదలవుతుంది".

నిర్మాతలు మాట్లాడుతూ " సినిమా చాలా బాగా వచ్చింది. రాజ్ సత్య అద్భుతంగా చిత్రీకరించారు. రాహుల్ రవీంద్రన్ నటన, హీరోయిన్ల గ్లామర్, సునీల్ కశ్యప్ సంగీతం, రావు రమేష్ గారి నటన మా చిత్రానికి మంచి హైలైట్ గా నిలుస్తుంది. ఈ నెల 23న అత్యధిక థియేటర్స్ లో విడుదల చేస్తున్నాము. తెలుగు ప్రేక్షకులకు నచ్చే సినిమా మా 'హైదరాబాద్ లవ్ స్టొరీ”.

More News

హరీష్ శంకర్ దర్శకత్వం లో 'సీటీమార్'

'గబ్బర్ సింగ్ ' తో ఇండస్ట్రీ హిట్ కొట్టిన డైరెక్టర్ హరీష్ శంకర్ దర్శకత్వంలో వచ్చిన సూపర్హిట్ చిత్రం 'దువ్వాడ జగన్నాథమ్ ' లోని

తేజు చేతికి నాని చిత్రం...?

శ్రీమంతుడు, జ‌న‌తాగ్యారేజ్ వంటి హిట్ చిత్రాల‌ను నిర్మించిన సంస్థ మైత్రీ మూవీ మేక‌ర్స్ ఇప్పుడు వ‌రుస సినిమాల‌ను నిర్మిస్తుంది. అందులో భాగంగా నేచుర‌ల్ స్టార్ నాని, కిశోర్ తిరుమ‌ల కాంబినేష‌న్‌లో ఓ సినిమా నిర్మించ‌డానికి సిద్ధ‌మైంది.

ప్రియా వారియ‌ర్‌కు సుప్రీమ్‌లో ఊర‌ట‌...

'ఒరు అదార్ ల‌వ్‌' అనే మ‌ల‌యాళ సినిమాలో న‌టించిన హీరోయిన్ ప్రియా ప్ర‌కాశ్ వారియ‌ర్ రాత్రికి రాత్రే పెద్ద సెలబ్రిటీ అయ్యింది. అయితే ఆమెకు ఎంత ఫేమ్ వ‌చ్చిందో... అదెలా చిక్కులు కూడా వ‌చ్చి ప‌డ్డాయి.

చ‌ర‌ణ్ సినిమా బిజినెస్ క్రేజ్‌...

స్టార్ హీరోల సినిమాల‌కు సినిమా నిర్మాణం నుండే మంచి క్రేజ్ ఉంటుంది. సినిమా పూర్తి కాక‌ముందు అన్ని ఏరియాల బిజినెస్‌లు పూర్తవుతుంటాయి.

గోపీచంద్ చిత్రంలో మ‌రోసారి...

'ఆంధ్రుడు', 'య‌జ్ఞం', 'ల‌క్ష్యం', 'శౌర్యం', 'లౌక్యం' వంటి సూప‌ర్‌డూప‌ర్ చిత్రాలతో మెప్పించిన టాలీవుడ్ ఎగ్రెసివ్ హీరో గోపీచంద్ క‌థానాయ‌కుడిగా శ్రీ స‌త్య‌సాయి ఆర్ట్స్ బ్యాన‌ర్‌పై ఓ సినిమా చేస్తున్న సంగ‌తి తెలిసిందే. ఇది గోపీచంద్ 25వ చిత్రం కావ‌డం విశేషం.