చంద్రబాబు సర్ వల్లే హైదరాబాద్ ఇంత అందంగా ఉంది: సోనూసూద్

కరోనా విపత్కర సమయంలో అభినవ కర్ణుడిగా ఇండియా మొత్తం రియల్ హీరో అనిపించుకున్నాడు సోనూసూద్. తెలుగు రాజకీయాల్లో చంద్రబాబు నాయుడు అపర చాణక్యుడు. సోనూసూద్ తాజాగా చంద్రబాబు పై ప్రశంసల వర్షం కురిపించాడు. హైదరాబాద్ అభివృద్ధి చెందిందంటే అది చంద్రబాబు వల్లే అని సోనూసూద్ అన్నారు.

ఇదీ చదవండి: 'ఫ్యామిలీ మ్యాన్ 2'పై ఆర్జీవీ రివ్యూ.. అంత నచ్చిందా!

నేను చాలా సందర్భాల్లో హైదరాబాద్ చాలా అందంగా ఉంటుందని చెప్పాను. ఐటి వచ్చాక హైదరాబాద్ ఇన్ఫ్రా స్ట్రక్చర్ మారిపోయింది. దీనంతటికి కారణం చంద్రబాబు నాయుడు సర్. ఆయన విజన్ కలిగిన నాయకుడు. నా స్టాఫ్ కి, సహచరులకు చాలా సార్లు ఈ విషయం చెబుతుంటాను.

చంద్రబాబు సర్ ని కొంత కాలం మన రాష్ట్రాలకు తీసుకువెళ్లాలి. దీనితో మన రాష్ట్రాలు కూడా అభివృద్ధి చెందుతాయి అని సోనూసూద్ చంద్రబాబుపై ప్రశంసలు కురిపించారు. చంద్రబాబు కూడా ఓ వర్చువల్ మీటింగ్ లో సోనూసూద్ సేవలని కొనియాడారు. సోనూసూద్ ఒక ఐకాన్ అని చంద్రబాబు అభివర్ణించారు.

గత ఏడాది లాక్ డౌన్ సమయం నుంచి సోనూసూద్ పేదవారికి సహాయం అందిస్తూనే ఉన్నారు. కరోనా ప్రభావంతో ఉద్యోగ ఉపాధి అవకాశాలు కోల్పోయిన వారికి కూడా ఓ మార్గం చూపుతున్నాడు. పలు ప్రాంతాల్లో ఆక్సిజన్ ప్లాంట్స్ ఏర్పాటు చేశాడు. ఈ మానవత్వ గుణమే సోనూసూద్ ని నేషనల్ హీరోగా నిలబెట్టింది.