Drugs Issue: డ్రగ్స్ వ్యవహారంలో సినీ ఇండస్ట్రీకి హైదరాబాద్ సీపీ స్ట్రాంగ్ వార్నింగ్

  • IndiaGlitz, [Wednesday,December 13 2023]

తెలంగాణ సీఎంగా రేవంత్ రెడ్డి బాధ్యతలు స్వీకరించాక తనదైన శైలిలో పాలన సాగిస్తున్నారు. ఇందులో భాగంగా తనదైన టీమ్‌ను తయారుచేసుకుంటున్నారు. ఈ క్రమంలోనే హైదరాబాద్‌ పోలీస్ కమిషనర్‌గా కొత్తకోట శ్రీనివాస్‌ రెడ్డిని నియమించారు. ఇవాళ నూతన నగర సీపీగా బాధ్యతలు స్వీకరించిన శ్రీనివాస్ రెడ్డి.. డ్రగ్స్ ముఠాకు స్ట్రాంగ్ వార్నింగ్ ఇచ్చారు. ఇక నుంచి రాష్ట్రంలో డ్రగ్స్ కార్యకలాపాలు సహించలేదని హెచ్చరించారు. పబ్స్‌, రెస్టారెంట్లు, రిసార్ట్స్ యజమానులు డ్రగ్స్ వ్యవహారంలో అప్రమత్తంగా ఉండాలని సూచించారు. ఎవరైనా సరే డ్రగ్స్ వాడకం ప్రోత్సహిస్తే కఠిన చర్యలు తప్పవన్నారు.

అలాగే సినీ పరిశ్రమలోని వారు కూడా డ్రగ్స్ వాడుతున్నట్లు సమాచారం ఉందని.. వారు వెంటనే మారాలని తెలిపారు. లేదంటే తీవ్ర పరిణామాలు ఉంటాయని హెచ్చరికలు జారీ చేశారు. త్వరలోనే ఇండస్ట్రీ పెద్దలతో దీనిపై సమావేశాలు నిర్వహిస్తామని పేర్కొన్నారు. రాష్ట్రంలో డ్రగ్స్‌ మహమ్మారిని కూకటివేళ్లతో సహా పెకిలించాలని సీఎం రేవంత్ రెడ్డి స్పష్టమైన ఆదేశాలు ఇచ్చారని వెల్లడించారు. అందుకు తగ్గట్లు తన కార్యాచరణ ఉంటుందన్నారు. చట్టాన్ని గౌరవించే వారికే ఫ్రెండ్లీ పోలీసింగ్‌.. ఉల్లంఘించే వారితో కఠినంగా వ్యవహరిస్తామని స్పష్టంచేశారు. హైదరాబాద్‌ కమిషనరేట్‌లో విధులు నిర్వహించడం అనేది సవాళ్లతో కూడుకున్నదని.. అయినా తనపై నమ్మకం ఉంచి బాధ్యతలు అప్పగించిన ముఖ్యమంత్రికి ధన్యవాదాలు చెప్పారు.

మరోవైపు తనదైన పాలనలో దూసుకుపోతున్న రేవంత్ రెడ్డి ముఖ్యంగా డ్రగ్స్ దందాపై ఫుల్ ఫోకస్ చేశారు. ఎట్టి పరిస్థితుల్లోనూ డ్రగ్స్ సరఫరా తెలంగాణలో జరగడానికి వీల్లేదని పోలీసులకు స్పష్టమైన ఆదేశాలు జారీ చేశారు. ఈ క్రమంలోనే నార్కోటిక్‌ బ్యూరోకు సీనియర్ ఐపీఎస్ అధికారి సందీప్‌ శాండిల్యను డైరెక్టర్‌గా నియమించారు. కాగా 2017లో టాలీవుడ్‌లో డ్రగ్స్ కేసు భారీగా ప్రకంపనలు రేపిన సంగతి తెలిసిందే. కెల్విన్‌ అనే డ్రగ్ ప్లడర్‌ను పోలీసులు పట్టుకోవడంతో సినీ తారల పేర్లు బయటకొచ్చాయి. ర‌వితేజ‌, ఛార్మీ, రకుల్‌ ప్రీత్‌ సింగ్‌, రానా, పూరి జ‌గ‌న్నాధ్‌, న‌వ‌దీప్, త‌రుణ్‌, త‌నీష్‌, సుబ్బరాజు, ముమైత్ ఖాన్ సహా పలువురు సెలబ్రిటీలను విచారించారు. అంతేకాకుండా వారి నుంచి గోళ్లు, వెంట్రుకల నమూనాలను సేకరించారు. అనంతరం దీనిపై సిట్ విచారణ కూడా చేశారు.

అయితే ఆ విచారణ వేగంగా ముందుకు సాగలేదు. ఇటీవల బయపటడిన డ్రగ్స్ కేసులోనూ సినీ సెలబ్రెటీల పేర్లు బయటకు రావడం నటుడు నవదీప్ విచారణకు హాజరు కావడం జరిగింది. అప్పటినుంచే ప్రతిపక్షంలో ఉన్న రేవంత్ రెడ్డి డ్రగ్స్ దందాపై తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. రాష్ట్రంలో డ్రగ్స్ వ్యవహారం లేకుండా చేయాలని కేసీఆర్ ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. ఇప్పుడు ఆయనే సీఎం కావడంతో డ్రగ్స్ ముఠా ఆగడాలకు చెక్ పెట్టేందుకు సిద్ధమయ్యారు. తెలంగాణను డ్రగ్స్ ఫ్రీ రాష్ట్రంగా తీర్చిదిద్దాలని రేవంత్ డిసైడ్ అయ్యారు. ఈ నేపథ్యంలోనే హైదరాబాద్ సీపీగా కొత్తగా బాధ్యతలు స్వీకరించిన శ్రీనివాస్ రెడ్డి కూడా డ్రగ్స్ ముఠాకు వార్నింగ్ ఇచ్చారు.

More News

Mallareddy:మాజీ మంత్రి మల్లారెడ్డిపై చీటింగ్ కేసు నమోదు

మాజీ మంత్రి, ప్రస్తుత బీఆర్ఎస్ ఎమ్మెల్యే చామకూర మల్లారెడ్డిపై పోలీస్ కేసు నమోదైంది.

Bhatti Vikramarka:డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క అధికారిక నివాసంగా ప్రజాభవన్

తెలంగాణ మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్.. అధికారంలో ఉన్నప్పుడు ప్రగతి భవన్ అధికారిక నివాసంగా ఉండేది.

Parliament: పార్లమెంట్‌లో భద్రతా వైఫల్యంపై కేంద్రం సీరియస్

అత్యాధునిక సౌకర్యాలు, అత్యంత పటిష్టమైన భద్రత ఉండే పార్లమెంట్‌లో ఈ స్థాయి భద్రతా వైఫల్యం జరగడం దేశవ్యాప్తంగా సంచలనంగా మారింది. అడుగుడుగునా సెక్యూరిటీ, ఢిల్లీ పోలీసులు

Lok Sabha: లోక్‌సభలో తీవ్ర భద్రత వైఫల్యం.. సభలోకి ప్రవేశించిన ఆగంతకులు..

కొత్తగా నిర్మించిన పార్లమెంట్ భవనంలో తీవ్ర భద్రత వైఫల్యం చోటుచేసుకుంది. లోక్‌సభ జరుగుతున్న సమయంలో విజిటింగ్ గ్యాలరీలో కూర్చున్న ఇద్దరు ఆగంతకులు సభలోకి ఒక్కసారిగా ప్రవేశించారు.

KTR:మరోసారి బెస్ట్‌ సిటీగా హైదరాబాద్‌.. సీఎం రేవంత్ రెడ్డికి కేటీఆర్ సూచన..

హైదరాబాద్ మినీ ఇండియాగా పేరు తెచ్చుకుంది. రకరకాల సంస్కృతులు, సాంప్రదాయాలు ఉన్న మతాల ప్రజలు కలిసిమెలిసి జీవించే నగరం భాగ్యనగరం.