Punjagutta Police Station: హైదరాబాద్ సీపీ సంచలన నిర్ణయం.. పంజాగుట్ట స్టేషన్ సిబ్బంది మొత్తం ట్రాన్స్‌ఫర్.. .

  • IndiaGlitz, [Wednesday,January 31 2024]

తెలంగాణ పోలీస్ డిపార్ట్‌మెంట్ చరిత్రలోనే హైదరాబాద్ నగర పోలీస్ కమిషనర్ శ్రీనివాస్ రెడ్డి సంచలన నిర్ణయం తీసుకున్నారు. పంజాగుట్ట పోలీస్ స్టేషన్‌ సిబ్బంది మొత్తాన్ని బదిలీ చేశారు. హోంగార్డు నుంచి ఇన్‌స్పెక్టర్ వరకు స్టేషన్‌లో ఉన్న మొత్తం 82 మందిని ఏఆర్‌కు అటాచ్ చేస్తూ ఆదేశాలు ఇచ్చారు. వీరిని వెంటనే సిటీ ఆర్మ్‌డ్‌ రిజర్వు ప్రధాన కార్యాయలంలో రిపోర్టు చేయాలని ఆదేశించారు. ఒకేసారి ఈ స్థాయిలో బదిలీలు కావడం రాష్ట్రవ్యాప్తంగా కలకలం రేపింది. కీలకమైన సమాచారం బయటకు చేరవేస్తున్నారనే ఆరోపణలతో ఈ నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తోంది.

కాగా గతేడాది డిసెంబర్ 23న ప్రజాభవన్ వద్ద బోధన్ మాజీ బీఆర్ఎస్ ఎమ్మెల్యే షకీల్ కుమారుడు రాహిల్ కారుతో ర్యాష్‌ డ్రైవింగ్ చేస్తూ బీభత్సం సృష్టించాడు. సమాచారం అందుకున్న పంజాగుట్ట పోలీసులు అతడిని అదుపులోకి తీసుకున్నారు. అయితే ఈ కేసులో రాహిల్‌ను తప్పించేందుకు అప్పటి సీఐ దుర్గారావు యత్నించారు. రాహిల్ స్థానంలో డ్రైవర్‌ను కేసులో చేర్చారు. అనంతరం రాహిల్ దుబాయ్ పారిపోయాడు. దీంతో కేసును తప్పుదోవ పట్టించేందుకు యత్నించిన షకీల్, రాహిల్‌పై పోలీసులు లుక్ అవుట్ నోటీసులు జారీ చేశారు.

ఈ కేసు రాష్ట్రవ్యాప్తంగా సంచలనంగా మారడంతో సీఐ సహా పలువురు పోలీసులను సస్పెండ్ చేశారు. ప్రస్తుతం సీఐ పరారీలో ఉండగా అతడి కోసం తీవ్రంగా గాలిస్తున్నారు. అలాగే నిజామాబాద్ సీఐ ప్రేమ్ కుమార్‌ను కూడా అరెస్టు చేసి బెయిల్‌పై విడుదల చేశారు. ఈ కేసుతో పాటు పలు కీలక విషయాలు బయటకి పొక్కడంపై సీపీ ఆగ్రహం వ్యక్తం చేస్తూ సిబ్బంది మొత్తాన్ని బదిలీ చేస్తూ నిర్ణయం తీసుకున్నారు. గతంలో ఇండియాలోనే బెస్ట్ పోలీస్‌ స్టేషన్‌గా పంజాగుట్ట పోలీసు స్టేషన్‌కు అవార్డు రావటం గమనార్హం.

More News

Kumari Aunty: కుమారి ఆంటీపై కేసు నమోదు.. వ్యాపారం క్లోజ్ చేయించిన పోలీసులు..

ఇటీవల కాలంలో ఫేమస్ అయిన కుమారి ఆంటీపై పోలీసులు కేసు నమోదు చేశారు. హైదరాబాద్‌ మాదాపూర్‌లోని కోహినూరు హోటల్ ఎదురుగా చిన్న ఫుడ్ స్టాల్‌ను నిర్వహిస్తున్నారు.

Gaddar Statue: మాట నిలబెట్టుకున్న సీఎం రేవంత్ రెడ్డి.. గద్దర్ విగ్రహ ఏర్పాటుకు గ్రీన్ సిగ్నల్..

దివంగత ప్రజా గాయకుడు గద్దర్ విగ్రహ ఏర్పాటుకు ప్రభుత్వం గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. తెల్లాపూర్ మున్సిపాలిటీ చేసిన తీర్మానానికి HMDA ఆమోదం తెలిపింది.

Adimoolam: నారా లోకేష్‌తో సత్యవేడు వైసీపీ ఎమ్మెల్యే ఆదిమూలం భేటీ

ఎన్నికల వేళ వైసీపీలో అసంతృప్త రాగాలు ఎక్కువతూనే ఉన్నాయి. ఈ క్రమంలోనే ఇతర పార్టీల్లోకి వెళ్లే వారి సంఖ్య కూడా పెరుగుతోంది.

Pushpa 2:పుష్ప2 నుంచి చీరలో బన్నీ గెటప్ లీక్.. దర్శకుడు సుకుమార్ సీరియస్..

ఐకాన్ స్టార్ అల్లు అర్జున్, డైరెక్టర్ సుకుమార్ కాంబినేషన్‌లో వచ్చిన పుష్ప సంచలన విజయం నమోదు చేసిన సంగతి తెలిసిందే.

Prof Kodandaram: తెలంగాణ హైకోర్టులో ప్రొఫెసర్ కోదండరామ్‌కు షాక్

గవర్నర్ కోటాలో ఎమ్మెల్సీలుగా ఎన్నికైన ప్రొఫెసర్ కోదండరామ్, మీర్‌ అమీర్‌ అలీఖాన్‌ ప్రమాణ స్వీకారానికి తెలంగాణ హైకోర్టు బ్రేక్ వేసింది. తదుపరి ఉత్తర్వులు ఇచ్చే వరకు ప్రమాణ స్వీకారం