CP Sandeep Shandilya:హైదరాబాద్ సీపీ సందీప్ శాండిల్యకు గుండెపోటు
Send us your feedback to audioarticles@vaarta.com
హైదరాబాద్ సీపీ సందీప్ శాండిల్య తీవ్ర అస్వస్థతకు గురయ్యారు. బషీర్‌బాగ్ పాత సీపీ కార్యాలయంలో ఉండగానే ఒక్కసారిగా ఆయన తీవ్ర ఛాతీ నొప్పితో బాధపడ్డారు. గమనించిన పోలీస్ సిబ్బంది వెంటనే ఆయనను హైదర్‌గూడ అపోలో ఆస్పత్రికి తరలించారు. ప్రస్తుతం ఆయన అక్కడ చికిత్స తీసుకుంటున్నారు. ప్రస్తుతం శాండిల్య ఆరోగ్య పరిస్థితి నిలకడగానే ఉందని వైద్యులు తెలిపారు. ఆస్పత్రిలో శాండిల్యను సీఐడీ చీఫ్ మహేశ్ భగవత్ పరామర్శించారు. ఆయన ఆరోగ్య పరిస్థితిపై పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.
తెలంగాణలో అసెంబ్లీ ఎన్నిక ప్రక్రియలో భాగంగా రాష్ట్రంలో భారీగా ఐఏఎస్, ఐపీఎస్‌లను బదిలీ చేస్తూ ఆ స్థానాల్లో కొత్త వారిని నియమించాలని కేంద్ర ఎన్నికల సంఘం ప్రభుత్వానికి సూచించింది. హైదరాబాద్ సీపీగా ఉన్న సీవీ ఆనంద్ స్థానంలో మరొకరిని నియమించాలని సీఈసీ ఆదేశించింది. ఈ మేరకు సీఎస్ శాంతికుమారి పంపించిన అధికారుల జాబితా నుంచి సందీప్ శాండిల్యను సెలెక్ట్ చేసి హైదరాబాద్ పోలీసు కమిషనర్‌గా నియమించింది. దీంతో ఆయన ప్రస్తుతం నగర సీపీగా బాధ్యతలు నిర్వర్తిస్తున్నారు.
1993 ఐపీఎస్ బ్యాచ్‌కు చెందిన సందీప్ శాండిల్య మెదటి పోస్టింగ్‌లో భాగంగా ఉమ్మడి ఏపీలోని గుంటూరులో పనిచేశారు. అనంతరం నల్గొండ, ఆదిలాబాద్, కృష్ణా, సౌత్ జోన్ డీసీపీగా విధులు నిర్వర్తించారు. అలాగే సీఐడీ, ఇంటిలిజెన్స్ సెక్యూరిటీ వింగ్‌లో, అడిషనల్ పోలీస్ కమిషనర్ క్రైమ్ డిపార్ట్‌మెంట్‌లో ఆయన సేవలందించారు. 2016 నుంచి 2018 వరకు సైబరాబాద్ పోలీస్ కమిషనర్‌గా కూడా ఉన్నారు.
Follow @ Google News: గూగుల్ న్యూస్ పేజీలోని ఇండియాగ్లిట్జ్ తెలుగు వెబ్‌సైట్‌ను అనుసరించడానికి మరియు వెంటనే వార్తలను తెలుసుకోవడాని ఇక్కడ క్లిక్ చేయండి.
Comments
- logoutLogout
-
Devan Karthik
Contact at support@indiaglitz.com