CP Sandeep Shandilya:హైదరాబాద్ సీపీ సందీప్ శాండిల్యకు గుండెపోటు

  • IndiaGlitz, [Monday,November 20 2023]

హైదరాబాద్ సీపీ సందీప్ శాండిల్య తీవ్ర అస్వస్థతకు గురయ్యారు. బషీర్‌బాగ్ పాత సీపీ కార్యాలయంలో ఉండగానే ఒక్కసారిగా ఆయన తీవ్ర ఛాతీ నొప్పితో బాధపడ్డారు. గమనించిన పోలీస్ సిబ్బంది వెంటనే ఆయనను హైదర్‌గూడ అపోలో ఆస్పత్రికి తరలించారు. ప్రస్తుతం ఆయన అక్కడ చికిత్స తీసుకుంటున్నారు. ప్రస్తుతం శాండిల్య ఆరోగ్య పరిస్థితి నిలకడగానే ఉందని వైద్యులు తెలిపారు. ఆస్పత్రిలో శాండిల్యను సీఐడీ చీఫ్‌ మహేశ్‌ భగవత్‌ పరామర్శించారు. ఆయన ఆరోగ్య పరిస్థితిపై పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.

తెలంగాణలో అసెంబ్లీ ఎన్నిక ప్రక్రియలో భాగంగా రాష్ట్రంలో భారీగా ఐఏఎస్, ఐపీఎస్‌లను బదిలీ చేస్తూ ఆ స్థానాల్లో కొత్త వారిని నియమించాలని కేంద్ర ఎన్నికల సంఘం ప్రభుత్వానికి సూచించింది. హైదరాబాద్ సీపీగా ఉన్న సీవీ ఆనంద్‌ స్థానంలో మరొకరిని నియమించాలని సీఈసీ ఆదేశించింది. ఈ మేరకు సీఎస్ శాంతికుమారి పంపించిన అధికారుల జాబితా నుంచి సందీప్‌ శాండిల్యను సెలెక్ట్ చేసి హైదరాబాద్‌ పోలీసు కమిషనర్‌గా నియమించింది. దీంతో ఆయన ప్రస్తుతం నగర సీపీగా బాధ్యతలు నిర్వర్తిస్తున్నారు.

1993 ఐపీఎస్ బ్యాచ్‌కు చెందిన సందీప్ శాండిల్య మెదటి పోస్టింగ్‌లో భాగంగా ఉమ్మడి ఏపీలోని గుంటూరులో పనిచేశారు. అనంతరం నల్గొండ, ఆదిలాబాద్, కృష్ణా, సౌత్ జోన్ డీసీపీగా విధులు నిర్వర్తించారు. అలాగే సీఐడీ, ఇంటిలిజెన్స్ సెక్యూరిటీ వింగ్‌లో, అడిషనల్ పోలీస్ కమిషనర్ క్రైమ్ డిపార్ట్‌మెంట్‌లో ఆయన సేవలందించారు. 2016 నుంచి 2018 వరకు సైబరాబాద్ పోలీస్ కమిషనర్‌గా కూడా ఉన్నారు.

More News

CM KCR:టీడీపీని ఎన్టీఆర్ అందుకే స్థాపించారు: సీఎం కేసీఆర్

తెలంగాణ ఎన్నికల ప్రచారంలో సీఎం కేసీఆర్ సుడిగాలి పర్యటనలు చేస్తున్నారు. కాంగ్రెస్ పార్టీపై తీవ్ర విమర్శలతో దూసుకుపోతున్నారు.

Chandrababu:చంద్రబాబుకు భారీ ఊరట.. స్కిల్ కేసులో బెయిల్ మంజూరు

టీడీపీ అధినేత చంద్రబాబుకు ఏపీ హైకోర్టులో భారీ ఊరట లభించింది. స్కిల్‌ డెవలప్‌మెంట్‌ కేసులో ఆయనకు పూర్తి స్థాయి బెయిల్‌ మంజూరు చేస్తూ

Greater Hyderabad:ఒంటిరిగా గ్రేటర్ హైదరాబాద్ అభ్యర్థులు.. కీలక నేతల కోసం ఎదురుచూపులు..

తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల్లో ప్రచారం తుది దశకు చేరింది. అన్ని పార్టీల నేతలు నియోజకవర్గాల్లో సుడిగాలి పర్యటనలు చేస్తున్నారు.

CM Jagan:విశాఖ అగ్నిప్రమాదం వెనక ప్రతిపక్షాల కుట్ర.. విచారణకు సీఎం జగన్ ఆదేశాలు..

అందమైన సాగర తీరమైన విశాఖ నగరంలో భారీ అగ్నిప్రమాదం సంభవించిన సంగతి తెలిసిందే. ఫిషింగ్ హార్బర్‌లో జరిగిన ఈ ఘోర ప్రమాదంపై సీఎం జగన్ తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు.

Lokesh:లోకేష్ పాదయాత్ర పున:ప్రారంభం.. ప్లాన్‌లో మార్పులు..

టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేశ్‌(Nara Lokesh) యువగళం పాదయాత్ర(Yuvagalam Padayatra) తిరిగి ప్రారంభం కానుంది.