హైదరాబాద్ బీఆర్ఎస్ ఎంపీ అభ్యర్థి ఖరారు.. ఒవైసీపై పోటీ ఎవరంటే..?

  • IndiaGlitz, [Monday,March 25 2024]

పెండింగ్‌లో ఉన్న హైదరాబాద్ పార్లమెంటు స్థానం బీఆర్ఎస్ అభ్యర్థిగా గడ్డం శ్రీనివాస్ యాదవ్ పేరును పార్టీ అధినేత కేసీఆర్ ప్రకటించారు. దీంతో నగరంలో బలంగా ఉన్న యాదవ సామాజిక వర్గానికి చెందిన శ్రీనివాస్.. ఎంఐఎం అధినేత, అసదుద్దీన్ ఒవైసీపై పోటీకి బరిలో దిగనున్నారు. తెలంగాణ వ్యాప్తంగా పార్లమెంటు ఎన్నికల్లో పోటీచేసే మొత్తం 17 స్థానాలకు అభ్యర్థుల ఎంపిక ప్రక్రియను కేసీఆర్ పూర్తి చేశారు. ఇక ఎన్నికల ప్రచారంపై దృష్టి పెట్టనున్నారు. త్వరలోనే రాష్ట్ర వ్యాప్తంగా సుడిగాలి పర్యటనలు చేయనున్నట్లు పార్టీ వర్గాలు తెలిపాయి.

17 మంది బీఆర్ఎస్ అభ్యర్థులు వీరే..

ఖమ్మం - నామా నాగేశ్వర్ రావు(ఓసీ)
మహబూబాబాద్ (ఎస్టీ )మాలోత్ కవిత
కరీంనగర్ - బోయినిపల్లి వినోద్ కుమార్ (ఓసీ)
పెద్దపల్లి(ఎస్సీ ) -కొప్పుల ఈశ్వర్
మహబూబ్ నగర్ -మన్నె శ్రీనివాస్ రెడ్డి (ఓసీ)
చేవెళ్ల -కాసాని జ్ఞానేశ్వర్ (బీసీ)
వరంగల్ (ఎస్సీ )-డాక్టర్ కడియం కావ్య
నిజామాబాద్ -బాజి రెడ్డి గోవర్ధన్ (బీసీ)
జహీరాబాద్ -గాలి అనిల్ కుమార్ (బీసీ)
ఆదిలాబాద్(ఎస్టీ ) -ఆత్రం సక్కు ( ఆదివాసీ)
మల్కాజ్ గిరి -రాగిడి లక్ష్మా రెడ్డి (ఓసీ)
మెదక్ -పి .వెంకట్రామి రెడ్డి (ఓసీ)
నాగర్ కర్నూల్ (ఎస్సీ )- ఆర్ .ఎస్ .ప్రవీణ్ కుమార్ .
సికింద్రాబాద్ - తీగుళ్ల పద్మారావు గౌడ్ ( బీసీ)
భువనగిరి - క్యామ మల్లేశ్ (బీసీ)
నల్గొండ - కంచర్ల కృష్ణారెడ్డి (ఓసీ)
హైదరాబాద్ - గడ్డం శ్రీనివాస్ యాదవ్ ( బీసీ)

ఇటీవల జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో ఓడిపోయి అధికారం కోల్పోవడంతో బీఆర్ఎస్ క్యాడర్ తీవ్ర నిరుత్సాహంలో ఉంది. ఓవైపు సిట్టింగ్ ఎమ్మెల్యేలు, ఎంపీలు, మాజీలు, కీలక నేతలు వరుసగా పార్టీని వదిలిపెట్టి వెళ్లిపోతున్నారు. దీంతో కేసీఆర్ కాస్త డీలా పడ్డారు. అయినా కానీ రెట్టించిన ఉత్సాహంతో పార్లమెంట్ ఎన్నికల్లో మెజార్టీ సీట్లు దక్కించుకోవాలని వ్యూహా రచనలు చేస్తున్నారు. ఈ క్రమంలోనే బలమైన అభ్యర్థులను బరిలో దింపారు. ఎలాగైనా లోక్‌సభ ఎన్నికల్లో 12 నుంచి 14 స్థానాల్లో విజయం సాధించి అటు పార్టీ శ్రేణుల్లో.. ఇటు ప్రజల్లో పునరుత్తేజాన్ని తీసుకురావాలని భావిస్తున్నారు.

More News

Sivangi Serial: ఈ నెల 25 నుండి జెమినీ టీవిలో రానున్న 'సివంగి'

తెలుగు ప్రేక్షకుల వినోదానికి కేరాఫ్ అడ్రస్ జెమిని టివి . ఎన్నో కార్యక్రమాలను , మరిన్నో సీరియల్స్ ను మనకు అందించిన జెమిని టివి.. ఇప్పుడు మనకు "సివంగి”.. అనే సరికొత్త సీరియ హిల్ ను మార్చ్ 25 నుండి

KTR: మీడియా సంస్థలకు కేటీఆర్ బామ్మర్ది లీగల్ నోటీసులు.. ఎందుకంటే..?

తెలుగు రాష్ట్రాల్లోని మీడియా సంస్థలకు బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్, మాజీ మంత్రి కేటీఆర్ బామ్మర్ది రాజేంద్రప్రసాద్ పాకాల లీగల్ నోటీసులు పంపడం కలకలం రేపుతోంది.

Janasena: అసెంబ్లీ ఎన్నికల బరిలో నిలిచే జనసేన అభ్యర్థులు వీరే..

ఏపీ అసెంబ్లీ ఎన్నికల్లో జనసేన పోటీ చేసే 21 స్థానాలకు గానూ 18 స్థానాలకు అభ్యర్థులను అధికారికంగా పార్టీ అధినేత పవన్ కల్యాణ్‌ ప్రకటించారు. తొలుత 5 మంది అభ్యర్థులను ప్రకటించగా..

BJP: కమలం పార్టీలో సీట్ల లొల్లి.. అధిష్టానం వైఖరిపై ఆగ్రహం..

కూటమిలో భాగంగా కేటాయించిన 6 ఎంపీ సీట్లకు అభ్యర్థులను బీజేపీ అధిష్టానం ప్రకటించింది. అరకు అభ్యర్థిగా కొత్తపల్లి గీత, సీఎం రమేశ్ (అనకాపల్లి), పురందేశ్వరి (రాజమహేంద్రవరం), భూపతిరాజు శ్రీనివాసవర్మ

Vangaveeti Radha: వంగవీటి వారసుడికి ఇదేం దుస్థితి..? స్వయంకృతాపరాధమేనా..?

వంగవీటి రంగా ఈ పేరుకు ఓ చరిత్ర ఉంది. కృష్ణా జిల్లాలో వంగవీటి కుటుంబం అంటే ఇప్పటికీ ఎనలేని ఆదరణ ఉంది. కాపు నాయకుడిగా రాజకీయాల్లోకి వచ్చిన వంగవీటి రంగా..