KTR:మరోసారి బెస్ట్ సిటీగా హైదరాబాద్.. సీఎం రేవంత్ రెడ్డికి కేటీఆర్ సూచన..
Send us your feedback to audioarticles@vaarta.com
హైదరాబాద్ మినీ ఇండియాగా పేరు తెచ్చుకుంది. రకరకాల సంస్కృతులు, సాంప్రదాయాలు ఉన్న మతాల ప్రజలు కలిసిమెలిసి జీవించే నగరం భాగ్యనగరం. అన్ని ప్రాంతాల ప్రజలు స్వే్చ్ఛగా జీవించే ప్రాంతం. అనుకూల వాతావారణం, కాస్ట్ ఆఫ్ లివింగ్.. మిగిలిన అన్ని నగరాల కంటే హైదరాబాద్‌లోనే తక్కువగా ఉండటంతో ఇక్కడ జీవించేందుకు జనాలు ఆసక్తి చూపిస్తూ ఉంటారు. అలాగే ప్రపంచ ప్రఖ్యాత కంపెనీలు తమ సెకండ్ హెడ్ క్వార్టర్స్‌ను నగరంలోనే ఏర్పాటు చేస్తున్నాయి. వేలాది కంపెనీలు ఇక్కడ కొలువుదీరుతున్నాయి. దీంతో లక్షలాది మంది ఇతర ప్రాంతాల ప్రజలు నగరంలో ఉపాధి పొందుతున్నారు. మహానగరంగా దినదినాభివృద్ధి చెందుతూ విశ్వనగరం వైపు వేగంగా దూసుకెళ్తోంది.
ఈ క్రమంలోనే హైదరాబాద్ మరోసారి దేశంలోనే బెస్ట్ సిటీగా పేరు తెచ్చుకుంది. మెరుగైన జీవన ప్రమాణాలు కలిగిన నగరాల జాబితాలో భారత్‌లోనే అగ్రస్థానంలో నిలిచింది. మెర్సర్స్ క్వాలిటీ ఆఫ్ లివింగ్ ర్యాంకింగ్స్-2023 ప్రపంచ వ్యాప్తంగా బెస్ట్ సిటీల జాబితాను విడుదల చేసింది. ఈ జాబితాలో వియన్నా(ఆస్ట్రియా) తొలి స్థానంలో నిలవగా.. రెండో స్థానంలో జురిచ్(స్విట్జర్లాండ్), మూడో స్థానంలో ఆక్లాండ్(న్యూజిలాండ్) నిలిచాయి. ఇక భారతదేశం నుంచి హైదరాబాద్ 153వ స్థానం, పూణె 154, బెంగళూరు 156, చెన్నై 161, ముంబై 164, కోల్‌కతా 170, న్యూఢిల్లీ 172వ స్థానాలు దక్కించుకున్నాయి.
హైదరాబాద్ బెస్ట్ సిటీగా నిలవడం ఇది ఆరోసారి కావడం విశేషం. 2015 నుంచి ఉత్తమ నగరంగా కొనసాగుతూనే ఉంది. హైదరాబాద్ వరుసగా ఆరోసారి బెస్ట్ సిటీగా అగ్రస్థానంలో ఉండటంతో మాజీ మంత్రి కేటీఆర్ ట్వీట్ చేశారు. మెర్సర్ ర్యాకింగ్స్‌లో పూణె, బెంగళూరు నగరాలను వెనక్కి నెట్టి హైదరాబాద్ బెస్ట్ సిటీగా నిలిచిందంటూ ఓ ఇంగ్లీష్ కథనాన్ని పోస్ట్ చేశారు. గత తొమ్మిది సంవత్సరాల్లో ఆరు సార్లు హైదరాబాద్ అత్యుత్తమ నగరంగా నిలిచిందని కొనియాడారు. ప్రతి హైదరాబాదీ గర్వించదగ్గ విషయమని తెలిపారు. ఇప్పుడు హైదరాబాద్‌ను మరో స్థాయికి తీసుకెళ్లే వంతు కొత్త ప్రభుత్వానికి వచ్చిందని సూచించారు.
Proud Hyderabadi ❤️
— KTR (@KTRBRS) December 13, 2023
We have ensured Hyderabad city topped the Mercer charts 6 times in last 9 years
Now it’s for the new Govt to take it to next level pic.twitter.com/s5F0qnvLeV
Follow @ Google News: గూగుల్ న్యూస్ పేజీలోని ఇండియాగ్లిట్జ్ తెలుగు వెబ్‌సైట్‌ను అనుసరించడానికి మరియు వెంటనే వార్తలను తెలుసుకోవడాని ఇక్కడ క్లిక్ చేయండి.
Comments