భార్య పళ్లు ఎత్తుగా ఉన్నాయని భర్త ట్రిపుల్ తలాక్!
Send us your feedback to audioarticles@vaarta.com
ట్రిపుల్ తలాక్ ఏ క్షణాన వెలుగులోకి వచ్చిందో కానీ.. దీన్ని అడ్డుపెట్టుకుని కొందరు ముస్లిం సోదరులు ఆడవారి జీవితాలతో ఆడుకుంటున్నారు. ఇప్పటికే పలు విచిత్ర కారణాలతో భార్యలకు భర్త తలాక్ చెప్పాడన్న వార్తలను మనందరమూ చదివేవుంటాం. దీన్ని నిషేధిస్తూ కేంద్ర ప్రభుత్వం చట్టం తీసుకొచ్చినప్పటికీ ఈ పద్ధతికి అడ్డుకట్ట పడట్లేదు. పెళ్లయిన మూడు నెలలకే భార్యకు ట్రిపుల్ తలాక్ చెప్పాడో భర్త. ఈ ఘటన హైదరాబాద్లోని కుషాయిగూడలో ఓ విచిత్ర ఘటన చోటుచేసుకుంది. ఇందుకు కారణం.. భార్యకు దంతాలు సరిగ్గా లేవని ట్రిపుల్ తలాక్ చెప్పినట్లు భర్త ముస్తఫా చెబుతున్నాడు.
అసలేం జరిగింది..!?
ఈ విషయమై బాధితురాలు రుక్సానా బేగం మీడియాతో మాట్లాడుతూ కన్నీరుమున్నీరైంది. ‘నాకు దంతాలు సరిగ్గా లేవని నా భర్త ట్రిపుల్ తలాక్ చెప్పాడు. కొంత కాలంగా ఈ కారణంగా నా భర్త వేధించాడు. నన్ను ఇక కలవద్దని, మన మధ్య బంధం తెగిపోయిందని అంటున్నాడు. నాకు న్యాయం చేయాలని కోరింది’ అని ఆమె చెప్పుకొచ్చింది. ఇదిలా ఉంటే ఈ వ్యవహారంపై కుషాయిగూడ పోలీస్స్టేషన్లో ట్రిపుల్ తలాక్ కేసు నమోదయ్యింది. కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు ప్రారంభించారు. కాగా.. కేంద్ర ప్రభుత్వం తీసుకొచ్చిన చట్టం ప్రకారం ట్రిపుల్ తలాక్ చెప్పే భర్తకు మూడేళ్ల జైలు శిక్ష పడుతుంది.
Follow @ Google News: గూగుల్ న్యూస్ పేజీలోని ఇండియాగ్లిట్జ్ తెలుగు వెబ్సైట్ను అనుసరించడానికి మరియు వెంటనే వార్తలను తెలుసుకోవడాని ఇక్కడ క్లిక్ చేయండి.
Comments