ఆమె ప్రెగ్నెన్సీతో నాకు సంబంధం లేదు.. నటి, ఎంపీపై భర్త సంచలనం!
Send us your feedback to audioarticles@vaarta.com
ప్రముఖ బెంగాలీ నటి, తృణమూల్ కాంగ్రెస్ ఎంపీ నుస్రత్ జహాన్ ప్రస్తుతం వార్తల్లో హాట్ టాపిక్ గా మారారు. బెంగాలీ చిత్రాల్లో గ్లామరస్ హీరోయిన్ గా నుస్రత్ రాణించింది. 2019లో నుస్రత్ బెంగాల్ లోని బసిర్ హాత్ నియోజకవర్గం నుంచి 3 లక్షల మెజారిటీతో విజయం సాధించారు. అప్పటి నుంచి ఆమె ఏదో ఒక విధంగా వార్తల్లో నిలుస్తూనే ఉన్నారు.
ఇదీ చదవండి: పవన్ మూవీలో స్టార్ డైరెక్టర్ కీలక పాత్ర ?
అదే ఏడాది నిఖిల్ జైన్ అనే వ్యాపారవేత్తని ఆమె వివాహం చేసుకుంది. వివాహం జరిగిన కొద్దిరోజులకే వీరి మధ్య మనస్పర్థలు మొదలయ్యాయి. ప్రస్తుతం వీరిద్దరూ విడిగా ఉంటున్నారు. తమ వివాహం టర్కిష్ చట్టం ప్రకారం జరిగిందని, ఆ వివాహం ఇండియాలో చెల్లదని ఆ మధ్యన నుస్రత్ కామెంట్స్ చేసింది.
అయితే తమకు విడాకులు మంజూరు చేయాలని తాను కోల్ కతా కోర్టులో పిటిషన్ వేసినట్లు తెలిపాడు. గత ఏడాది నుంచి తామిద్దరం విడిగా ఉంటున్నట్లు నిఖిల్ తెలిపాడు.
అయితే తాజాగా జరుగుతున్న ఓ ప్రచారం వీరిద్దరిని తిరిగి వార్తల్లో నిలిపింది. ప్రస్తుతం నుస్రత్ గర్భంతో ఉన్నట్లు తెలుస్తోంది. త్వరలో ఆమె తల్లి కాబోతోందని వార్తలు వస్తున్నాయి. ఇదే ప్రశ్న నిఖిల్ కి ఎదురుకాగా అతడు సంచలన వ్యాఖ్యలు చేశాడు. ఆమె గర్భవతి కావడానికి తాను కారణం కాదని, ఆమె కడుపులో పెరుగుతున్న బిడ్డ తన బిడ్డ కాదని సంచలన వ్యాఖ్యలు చేశాడు.
దీనితో ఆమె మరెవరితో అయినా రిలేషన్ లో ఉందా అనే ప్రశ్న తలెత్తడం ఖాయం. దీనిపై కూడా అనేక వార్తలు వస్తున్నాయి. నుస్రత్ ప్రస్తుతం యష్ దాస్ గుప్తా అనే బెంగాలీ నటుడితో రిలేషన్ షిప్ లో ఉందని వార్తలు వస్తున్నాయి. బుల్లి తెరపై కెరీర్ ప్రారంభించిన యష్ దాస్ ఆ తర్వాత వెండితెరపై కూడా నటించాడు.
నుస్రత్, యష్ దాస్ 2017లో 'వన్' అనే చిత్రాల్లో నటించారు. ప్రస్తుతం యష్ బిజెపిలో కొనసాగుతున్నాడు. నుస్రత్ తనకు మంచి స్నేహితురాలి, తమ మధ్య ఏం లేదని గతంలో యష్ చెప్పేవాడు.
Follow @ Google News: గూగుల్ న్యూస్ పేజీలోని ఇండియాగ్లిట్జ్ తెలుగు వెబ్‌సైట్‌ను అనుసరించడానికి మరియు వెంటనే వార్తలను తెలుసుకోవడాని ఇక్కడ క్లిక్ చేయండి.
Comments
- logoutLogout
-
Devan Karthik
Contact at support@indiaglitz.com