చావు బతుకుల్లో భర్త.. ఆయనతోనే పిల్లలు కనాలి అంటూ కోర్టుకి భార్య!
Send us your feedback to audioarticles@vaarta.com
మహమ్మారి కరోనా ప్రజా జీవనాన్ని, కుటుంబాలని ఎలా నాశనం చేస్తోందో కళ్లారా చూస్తూనే ఉన్నాం. కరోనా వల్ల ఎన్నో కుటుంబాలు వీధిన పడుతున్నాయి. గుజరాత్ లో ఓ మహిళ విషాదకరమైన విచిత్ర పరిస్థితుల్లో కోర్టు మెట్లెక్కింది. ఆమె ఆశలు కోవిడ్ వల్ల అడియాశలుగా మారుతున్నాయి.
వివరాల్లోకి వెళితే.. గత ఏడాది గుజరాత్ కు చెందిన యువతి కొత్త ఆశలు, ఆకాంక్షలతో వివాహ బంధంలోకి అడుగుపెట్టింది. కానీ కరోనా మహమ్మారి వల్ల ఆమె ఆశలపై నీలి నీడలు కమ్ముకున్నాయి. ఆమె భర్తకు కరోనా సోకడంతో ప్రస్తుతం వడోదరలో ఓ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నాడు.
అతడి ఆరోగ్యం విషమంగా మారింది. వెంటిలేటర్ పై ఉంచి చికిత్స చేస్తున్నారు. అతడు బతకడం దాదాపుగా అసాధ్యం అని వైద్యులు తేల్చేశారు. మల్టిపుల్ ఆర్గాన్స్ ఫెయిల్ అయ్యాయి. ప్రస్తుతం చావు బతుకుల మధ్య ఆసుపత్రిలోనే చికిత్స పొందుతున్నాడు.
దీనితో అతడి భార్య ఇలాంటి పరిస్థితుల్లో కోర్టు మెట్లెక్కడం హాట్ టాపిక్ గా మారింది. భర్త దూరమవుతున్నప్పటికీ ఆయనతోనే పిల్లలు కనాలని ఆమె నిర్ణయించుకుంది. దీనికోసం అన్ని విధాలుగా ప్రయత్నిస్తోంది. కోర్టుకు కూడా వెళ్ళింది.
తన భర్తతోనే తాను పిల్లలు కనాలనుకుంటున్నట్లు ఆమె వైద్యులకు చెప్పింది. ఐవీఎఫ్, ఏఆర్ టి శాస్త్రీయ విధానంలో తన భర్త ద్వారా తాను పిల్లలు పొందేలా చూడాలని వైద్యులని కోరింది. అందుకోసం తన భర్త వీర్యం సేకరించి భద్రపరచాలి కోరింది. కానీ వైద్యులు అందుకు అంగీకరించలేదు. చట్టం అనుమతి లేకుండా అలా చేయలేమని అన్నారు.
దీనితో సదరు మహిళ కోర్టులో జూలై 20న అత్యవసర పిటిషన్ దాఖలు చేసింది. ఆమె కోరికని ఆసుపత్రి తిరస్కరిస్తోందని మహిళ తరుపున న్యాయవాది కోర్టుకు వివరించారు. ఇది అత్యవసర పరిస్థితి కనుక వెంటనే ఆమె భర్త వీర్యాన్ని సేకరించి భద్రపరచాలని హైకోర్టు జడ్జి జస్టిస్ అశుతోష్ శాస్త్రి రాష్ట్ర ప్రభుత్వాన్ని, ఆసుపత్రిని ఆదేశించారు.
ఇది అత్యవసర పరిస్థితి కనుక తాత్కాలిక ఉత్తర్వలు జారీ చేస్తున్నట్లు జడ్జి పేర్కొన్నారు. ఈ ఉత్తర్వులు ఫైనల్ తీర్పుకు లోబడి ఉంటాయని అన్నారు. వెంటనే ఈ విషయాన్ని ఆసుపత్రికి తెలియజేయాలని మహిళని, ప్రభుత్వ లాయర్ ని ఆదేశించారు. ఆసుపత్రి డైరెక్టర్ ఈ నెల 23 లోగా తన స్పందన తెలియజేయాలని కోరారు.
Follow @ Google News: గూగుల్ న్యూస్ పేజీలోని ఇండియాగ్లిట్జ్ తెలుగు వెబ్‌సైట్‌ను అనుసరించడానికి మరియు వెంటనే వార్తలను తెలుసుకోవడాని ఇక్కడ క్లిక్ చేయండి.
Comments
- logoutLogout
-
Devan Karthik
Contact at support@indiaglitz.com