ఆస్పత్రిలో భార్యపై భర్త పైశాచిత్వం.. చివరికి విషాదం!

  • IndiaGlitz, [Thursday,April 25 2019]

భర్త పైశాచికత్వంతో చావు బతుకుల మధ్య ఆస్పత్రిలో చికిత్స పొందుతున్న మహిళ మృతి చెందింది. రెండు రోజుల క్రితం చిత్తూరు ప్రభుత్వ ఆస్పత్రిలో ఈ దారుణం చోటు చేసుకుంది. తాగిన మైకంలో భార్యపై భర్త బలవంతంగా లైంగిక దాడి చేయడంతో తీవ్రంగా గాయపడి ఆస్పత్రిలో చికిత్స పొందుతూ గురువారం కన్నుమూసింది.

అసలేం జరిగింది..!

వివరాల్లోకెళితే.. జీవితాంతం చూసుకుంటానని అగ్ని సాక్షిగా ప్రమాణం చేసి.. కట్టుకున్న మొగుడే కాలయముడిగా మారాడు. అసలు తామున్నది ఆస్పత్రి అని కూడా చూడకుండా పైశాచికంగా ఆమెపై లైంగిక దాడి చేసి తీవ్రంగా గాయపరిచాడు. ఈ తంతు అంతా చిత్తూరు ప్రభుత్వ ఆస్పత్రిలో రెండు రోజుల క్రితం చోటుచేసుకుంది. యాడమరి మండలం పీసీ కండ్రిగ గ్రామానికి చెందిన నంద, పద్మలు భార్యాభర్తలు. వీరికి నలుగురు కుమార్తెలు ఉన్నారు. వీరిలో ఒక కుమార్తెకు అనారోగ్యం భారీన పడటంతో రెండు రోజుల క్రితం చిత్తూరు ప్రభుత్వ ఆసుపత్రిలో చేర్పించారు. అదే రోజు కుమార్తెకు, బిడ్డకు టిఫిన్ తీసుకొచ్చి ఇచ్చిన భర్త అనంతరం ఆస్పత్రి నుంచి బయటికెళ్లి పూటుగా మద్యం సేవించి వచ్చాడు. తిరిగి 11 గంటల ప్రాంతంలో ఆస్పత్రికి వచ్చాడు. ఆ సమయంలో నిద్రిస్తున్న భార్యను లేపి బలవంతంగా ఆస్పత్రి మిద్దె పైకి తీసుకెళ్ళాడు. 

వేడుకున్నా వినని భర్త.. చివరికి విషాదం!

భార్యా కాళ్లావేళ్లా పడి ఇది మన ఇల్లు కాదని చేతులు జోడించి వేడుకున్నా మద్యం మత్తులో ఉన్న వినిపించుకోలేదు. చిత్రహింసలకు గురి చేసిన బలవంతంగా భార్యపై లైంగిక దాడి చేశాడు. దీంతో భార్య తీవ్రంగా గాయపడింది. భర్త నుంచి తప్పించుకుని కిందికి వచ్చిన ఆమె.. ఆస్పత్రిలో ఉన్న జనాలకు భర్త గురించి చెప్పింది. అయితే అప్పటికే పద్మ పరిస్థితి విషమించడంతో హుటాహుటిన ఆస్పత్రికి తరలించి వైద్యం అందించారు. చికిత్స పొందుతూ గురువారం తెల్లవారు జామున పద్మ కన్నుమూసింది. విషయం తెలుసుకున్న భర్త పరారయ్యాడు. గురువారం ఉదయం చోటు చేసుకున్న ఈ ఘటన ఆలస్యం వెలుగు చూసింది. కుమార్తెలు, పద్మ తల్లిదండ్రుల ఫిర్యాదుతో రంగంలోకి దిగిన పోలీసులు కేసు నమోదు చేసుకుని పరారీలో ఉన్న నిందితుడి కోసం గాలించి సాయంత్రానికల్లా అరెస్ట్ చేశారు. నిందితుడ్ని కఠినంగా శిక్షించాలని భార్య బంధువులు, కుటుంబీకులు డిమాండ్ చేస్తున్నారు. కాగా ఈ ఘటనకు సంబంధించి మరింత సమాచారం తెలియాల్సి ఉంది.

More News

మోదీకి స్వీట్లిచ్చింది నిజమే.. కానీ.. : స్ట్రాంగ్ కౌంటరిచ్చిన దీదీ

ఇటీవల ప్రధాని నరేంద్ర మోదీతో బాలీవుడ్ టాప్ హీరో అక్షయ్ కుమార్ చేసిన ఇంటర్వ్యూలో ఆసక్తికర విషయాలు వెలుగు చూసిన సంగతి తెలిసిందే.

హైదరాబాద్‌లో బస్సు మిస్సింగ్.. నాందేడ్‌లో పార్ట్స్‌ లేకుండా ప్రత్యక్షం!

హైదరాబాద్‌లో ఆర్టీసీ బస్ మిస్సింగ్ కలకలం రేపిన సంగతి తెలిసిందే. నగరంలోని ఆఫ్జల్ గంజ్ వద్ద అపహరణకు గురైన టీఎస్ఆర్టీసీ బస్సు మహారాష్ట్రలోని నాందేడ్ వద్ద ప్రత్యక్షమైంది.

బర్త్ డే రోజున బాలకృష్ణ సినిమా గురించి చెప్పిన బోయపాటి

బాలకృష్ణ, బోయపాటి శ్రీనుల కాంబినేషన్‌లో సినిమా అంటేనే ఫుల్‌ క్రేజ్‌ ఉంటుంది. 'సింహా', 'లెజెండ్‌' వంటి  బ్లాక్‌బస్టర్‌ చిత్రాలను అందించిన ఈ కాంబినేషన్‌ ఇప్పుడు హ్యాట్రిక్‌ ఇవ్వడానికి రెడీ అవుతోంది.

శివాజీ రాజా 'రిటర్న్‌గిఫ్ట్‌' పై నాగబాబు రియాక్షన్!

'మా' (మూవీ ఆర్టిస్ట్ అసోసియేషన్) ఎన్నికల్లో తన ఓటమికి కారణమైన మెగా బ్రదర్, జనసేన ఎంపీ అభ్యర్థి నాగబాబుకు రిటర్న్ గిఫ్ట్ ఇస్తానని మాజీ అధ్యక్షుడు, నటుడు శివాజీ రాజా వ్యాఖ్యానించిన సంగతి తెలిసిందే.

సడన్ షాకిచ్చిన ఉదయభాను.. బిగ్‌బాస్-3 నుంచి ఔట్ ?

బిగ్‌బాస్-3 షో త్వరలోనే తెలుగు ప్రేక్షకుల ముందు రానున్న సంగతి తెలిసిందే. ఇప్పటికే హోస్ట్, కంటెస్టెంట్ల విషయమై నిర్వాహకులు జోరు పెంచారు.