హీరోయిన్ పెళ్లి చేసుకుని మోసం చేసింది.. భర్త సంచలన ఆరోపణలు..
Send us your feedback to audioarticles@vaarta.com
ఆమె తెలుగు సీరియల్స్‌లో నటిస్తోంది. మ్యాట్రిమోనీ సైట్‌లో ఓ యువకుడిని చూసి ఇష్టపడింది. తర్వాత అతడు కూడా ఆమెను ఇష్టపడ్డాడు. అనంతరం పెళ్లి చేసుకున్నారు. ఇంతవరకు బాగానే ఉంది. ఇక్కడే సీరియల్స్‌లో జరిగే అసలైన ట్విస్ట్ బయటపడింది. అసలు ఏం జరిగిందంటే ప్రముఖ టీవీ సీరియల్ నటి అడ్డాల ఐశ్వర్య తనను పెళ్లి చేసుకుని మోసం చేసిందని ఆమె భర్త పిన్నింటి శ్యామ్ కుమార్ ఆరోపిస్తున్నాడు. మరో వ్యక్తితో ఎఫైర్ పెట్టుకుని విడాకులు ఇవ్వాలంటూ తనతో పాటు తన కుటుంబాన్ని మానసిక ఇబ్బందులకు గురిచేస్తుందని వాపోయాడు.
కాపు మ్యాట్రిమోనీ ద్వారా సీరియల్ నటి ఐశ్వర్యను పెళ్లి చేసుకున్నట్లు శ్యామ్ చెబుతున్నాడు. గతేడాది సెప్టెంబర్ ఆరో తేదీన ఐశ్వర్యతో తనకు వివాహమైందని తెలిపాడు. ఆ తర్వాత హైదరాబాద్‌లో కాపురం పెట్టగా.. ఆమె నిజస్వరూపం తెలిసిందని ఆవేదన వ్యక్తం చేశాడు. చెడు అలవాట్లకు బానిస అవ్వడంతో పాటు రియల్ ఎస్టేట్ వ్యాపారి కరణం రమేష్ బాబుతో వివాహేతర సంబంధం పెట్టుకుని తనను వేధింపులకు గురిచేస్తోందని ఆరోపించాడు. పెళ్లయిన నెల రోజులకే ఐశ్వర్య అఫైర్ గురించి తనకు తెలిసిందని.. ఇదేంటని నిలదీస్తే తనపైనే ఎదురుదాడి చేసిందన్నాడు.
తక్షణమే తనకు విడాకులు ఇవ్వాలని.. లేదంటే గృహహింస లాంటి అక్రమ కేసులు పెడతానని వేధింపులకు గురిచేస్తోందని ఆరోపణలు చేశాడు. ఈ క్రమంలోనే ఒక్కసారి తనపై భౌతిక దాడికి కూడా పాల్పడిందని తెలిపాడు. ఐశ్వర్య తల్లిదండ్రులు కూడా ఆమెకే వంతపాడుతూ తన కుటుంబాన్ని వేధిస్తున్నారని వెల్లడించాడు. ఈ నేపథ్యంలో రమేష్‌బాబు, ఐశ్వర్యతో తాను మాట్లాడిన ఆడియో కాల్స్ మీడియా ముందు బయటపెట్టాడు. అంతేకాకుండా వివాహం తర్వాత తన దగ్గర రూ.25లక్షలు తీసుకుని మోసం చేసిందన్నాడు. తనని పెళ్లి చేసుకుని దారుణంగా మోసం చేయడంపై పోలీసు కేసు కూడా పెడుతున్నట్లు వివరించాడు.
కాగా ఐశ్వర్య కొన్ని సీరియల్స్‌తో పాటు నీ రూటే సపరేటు, ఈ సినిమా సూపర్ హిట్ గ్యారెంటీ, త్రిముఖి లాంటి చిత్రాల్లో హీరోయిన్ గా నటించింది. అలాగే ప్రస్తుతం అమ్మాయి గారు, పలుకే బంగారామాయేనా, అలా వైకుంఠపురం, అత్తారింటికి దారేది సీరియల్స్‌లో నటిస్తోంది. తన భర్త ఆరోపణలపై ఆమె ఇంకా స్పందించలేదు.
Follow @ Google News: గూగుల్ న్యూస్ పేజీలోని ఇండియాగ్లిట్జ్ తెలుగు వెబ్‌సైట్‌ను అనుసరించడానికి మరియు వెంటనే వార్తలను తెలుసుకోవడాని ఇక్కడ క్లిక్ చేయండి.
Comments
- logoutLogout
-
Devan Karthik
Contact at support@indiaglitz.com