అఖిల్ కోసం భారీ స్టార్ కాస్ట్..!
Send us your feedback to audioarticles@vaarta.com
అఖిల్ అక్కినేని హీరోగా సురేందర్ రెడ్డి దర్శకత్వంలో ఓ సినిమా రూపొందనున్న సంగతి తెలిసిందే. ఈ సినిమాకు సంబంధించిన ప్రీ ప్రొడక్షన్ పనులు శరవేగంగా జరుగుతున్నాయి. కాగా.. ఈ సినిమాలో హీరోయిన్గా ముంబై మోడల్ సాక్షి వైద్యను తీసుకుంటున్నారని వార్తలు వినిపించిన సంగతి తెలిసిందే. భారీ స్టార్ క్యాస్టింగ్‌తో ఈసినిమాను తెరకెక్కించాలని డైరెక్టర్ సురేందర్ రెడ్డి భావిస్తున్నాడట. అందులో ఇతర భాషలకు చెందిన స్టార్స్‌ను రంగంలోకి దించుతున్నట్లు వార్తలు వినిపిస్తున్నాయి. సినిమాను మేకింగ్ పరంగా అన్ కాంప్రమైజ్డ్గా నిర్మించడానికి నిర్మాతలు ఓకే చెప్పేశారు.
వివరాల మేరకు మలయాళ సూపర్‌స్టార్ మోహన్‌లాల్, కోలీవుడ్ స్టార్ అరవింద స్వామి ఈ చిత్రంలో నటించనున్నారట. నలబై కోట్ల రూపాయల బడ్జెట్‌తో ఈ సినిమాను తెరకెక్కించడానికి ప్లాన్ చేసుకున్నారట. అయితే తెలుగులో అఖిల్ మీద అంత బడ్జెట్ పెడతారా? అనేది ఆలోచించాల్సిన విషయం. ప్రస్తుతం మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచ్‌లర్ షూటింగ్లో ఉన్న అఖిల్ అక్కినేని, నెక్ట్స్ సురేందర్ రెడ్డి సినిమాలో జాయిన్ అవుతాడట. యాఓన్ ఎంటర్టైనర్గా సినిమాను తెరకెక్కిస్తారట. ఎ.కె.ఎంటర్టైన్మెంట్స్ బ్యానర్‌పై అనీల్ సుంకర ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు.
Follow @ Google News: గూగుల్ న్యూస్ పేజీలోని ఇండియాగ్లిట్జ్ తెలుగు వెబ్‌సైట్‌ను అనుసరించడానికి మరియు వెంటనే వార్తలను తెలుసుకోవడాని ఇక్కడ క్లిక్ చేయండి.
Comments
- logoutLogout
-
Devan Karthik
Contact at support@indiaglitz.com