బాలయ్యకు భారీ షాక్!
- IndiaGlitz, [Wednesday,May 29 2019]
టైటిల్ చూడగానే ఇదేంటి.. ఆంధ్రప్రదేశ్ ఎన్నికల్లో వైసీపీ విజయకేతనం ఎగరేసింది.. రేపు సీఎం వైఎస్ జగన్ ప్రమాణ స్వీకారం చేయబోతున్నారు.. మరోవైపు హిందూపురం నుంచి రెండోసారి ఎమ్మెల్యేగా నందమూరి బాలయ్య కూడా గెలిచారు. ఇదంతా అయిపోయి కూడా ఐదారు రోజులు కావొస్తోందిగా.. ఇంకా భారీ షాక్ ఏంటి..? అని అనుకుంటున్నారా..? ఇదిగో ఈ ఆర్టికల్ కాస్త క్లారిటీగా చదవండి అసలు విషయమేంటో మీకే అర్థమవుతుంది.
సినిమా ఆగింది..!
బాలయ్యతో ‘జైసింహా’ లాంటి మాస్ ఎంటర్టైనర్ను తెరకెక్కించిన సీనియర్ దర్శకుడు కె.ఎస్.రవికుమార్‌తో నటసింహం నందమూరి బాలకృష్ణ కొత్త సినిమాను ప్రారంభించిన విషయం అందరికీ తెలిసిందే. ఈ సినిమాను సి. కళ్యాణ్ నిర్మిస్తుండగా.. జగపతిబాబు విలన్‌గా డ్యూయల్ రోల్ పోషిస్తున్నట్లు ప్రకటించారు. అన్నీ అనుకున్నట్లు జరిగితే ఆగస్టు నుంచి రెగ్యులర్ షూటింగ్ కూడా ప్రారంభమవుతుందని ప్రకటించారు కూడా. అయితే సడన్‌గా ఈ చిత్రం ఆగిపోయిందని.. దీంతో బాలయ్యకు భారీ షాక్ తగిలిందని వార్తలు వినవస్తున్నాయి.
వైసీపీ గెలవడంతో..!
అసలు విషయానికొస్తే.. ఫ్లాష్ బ్యాక్‌లో తాతగా.. ప్రస్తుతంలో మనవడిగా జగపతిబాబు కనిపిస్తారని టాక్ నడుస్తోంది. ఈ రెండూ విలన్ పాత్రలేనట. వాస్తవానికి ఈ పాత్రలు రెండూ దివంగత ముఖ్యమంత్రి వైఎస్ తండ్రి రాజారెడ్డి, వైఎస్ జగన్‌లను గుర్తుచేసేలా స్క్రిప్టులో దర్శకుడు రాసుకున్నారట. ఇదంతా చంద్రబాబు సీఎంగా ఉన్న హయాంలో జరిగిందట. అయితే ఇప్పుడు ఏపీ ఎన్నికల్లో టీడీపీ అట్టర్ ప్లాప్ అవ్వడం.. వైసీపీ విజయకేతనం ఎగరేయడంతో అసలు ఈ సినిమా తీయడం అవసరమా..? అని అటు నిర్మాత.. ఇటు డైరెక్టర్ ఇద్దరూ వెనకడుగేశారట. అంతేకాదు బాలయ్య సైతం ఇక తీయాల్సిన అక్కర్లేదని చెప్పేశారని టాక్.
షాక్‌ల మీద షాక్‌లు!
అంతేకాదు.. ఒకవేళ స్క్రిప్టు మార్చాలనుకున్నా అది ఇప్పుడప్పుడు అస్సలు జరిగే పనికాదని డైరెక్టర్, నిర్మాత సినిమా ఆపేయాలని నిర్ణయించారట. కాగా ఇప్పటికే ఆంధ్రుల ఆరాధ్యుడు నందమూరి తారకరామారావు జీవిత కథ ఆధారంగా తెరకెక్కిన రెండు సినిమాలు అట్టర్ ప్లాప్ టాక్ తెచ్చిపెట్టాయి. ఒకానొక సందర్భంలో బాలయ్య కూడా ఈ సినిమాలు అనవసరంగా తీశామని బాధపడిన సందర్భాలున్నాయట. అయితే ఈ ప్లాప్లనుంచి కాస్త ఉపశమనం పొందాలంటే మళ్లీ పొలిటికల్ బ్యాగ్రౌండ్ ఉండే సినిమా అయితే రిలీఫ్ అవుతామని భావించగా.. జగన్ సీఎం కావడంతో బాలయ్య భారీ షాక్ తగిలినట్లైంది. సో.. ఈ సినిమా నిలుపుదల విషయమై అధికారికంగా ప్రకటన వెలువడాల్సి ఉంది.