భారీ సెట్టింగ్ లో బాలయ్య సాంగ్..
Send us your feedback to audioarticles@vaarta.com
నందమూరి నట సింహాం బాలయ్య నటిస్తున్న తాజా చిత్రం డిక్టేటర్. ఈ చిత్రాన్ని శ్రీవాస్ తెరకెక్కిస్తున్నారు. ఈరోస్ ఇంటర్నేషనల్ సంస్థ డైరెక్టర్ శ్రీవాస్ తో కలసి ఈ చిత్రాన్ని నిర్మిస్తుండడం విశేషం. ఈ చిత్రం ప్రస్తుతం రామోజీ ఫిలింసిటీలో శరవేగంగా షూటింగ్ జరుపుకుంటుంది. బాలయ్య పై భారీ స్ధాయిలో ఓ సాంగ్ ను చిత్రీకరిస్తున్నారు. దాదాపు 100 మంది డాన్సర్స్ పాల్గొంటున్న ఈ పాటకు రోజురోజుకు 30 లక్షలు ఖర్చులు అవుతుంది.
దాదాపు కోటి రూపాయల పైనే ఖర్చు పెట్టి ఈ సాంగ్ ను చిత్రీకరిస్తున్నారు. ఈ చిత్రంలో బాలయ్య సరసన అంజలి, సోనాలి చౌహాన్, అక్ష నటిస్తున్నారు. తమన్ సంగీతాన్ని అందిస్తున్న డిక్టేటర్ ఆడియోను డిసెంబర్ 20న రిలీజ్ చేయనున్నారు. కోన వెంకట్, గోపీ మోహన్ ల కథతో రూపొందుతున్న డిక్టేటర్ చిత్రం సంక్రాంతి కానుకగా రిలీజ్ కి రెడీ అవుతుంది.
Follow @ Google News: గూగుల్ న్యూస్ పేజీలోని ఇండియాగ్లిట్జ్ తెలుగు వెబ్‌సైట్‌ను అనుసరించడానికి మరియు వెంటనే వార్తలను తెలుసుకోవడాని ఇక్కడ క్లిక్ చేయండి.
-
Contact at support@indiaglitz.com
Comments