శ్రీనివాస కళ్యాణం కోసం భారీ సెట్
Send us your feedback to audioarticles@vaarta.com
సక్సెస్‌ఫుల్ ప్రొడ్యూసర్ దిల్ రాజు, దర్శకుడు సతీష్ వేగేశ్న కాంబినేషన్‌లో వచ్చిన 'శతమానం భవతి' మంచి విజయం సాధించిన సంగతి తెలిసిందే. ఆ చిత్రంలో.. తల్లిదండ్రులు, పిల్లల మధ్య అనుబంధాన్ని చాలా భావోద్వేగంగా చూపించి ప్రేక్షకుల మన్ననలను పొందడమే కాదు.. ఉత్తమ చిత్రంగా జాతీయ పురస్కారాన్ని కూడా అందుకున్నారు. మరోసారి వీరి కాంబినేషన్‌లో సినిమా రానుంది. ఈసారి వివాహ బంధాన్ని తెలియజేసే కథతో ప్రేక్షకుల ముందుకు రానున్నారు ఈ ద్వయం.
కాస్త వివరాల్లోకి వెళితే.. నితిన్, రాశి ఖన్నా జంటగా నటిస్తున్న చిత్రం 'శ్రీనివాస కళ్యాణం'. దిల్ రాజు నిర్మాణంలో సతీష్ వేగేశ్న దర్శకత్వం వహిస్తున్నారు. రెండు కుటుంబాలు, వివాహ బంధం నేపథ్యంతో సాగే కథతో ఈ చిత్రాన్ని తెరకెక్కిస్తున్నారని సమాచారం.
ఈ రెండు కుటుంబాల కోసం రాజమండ్రి పరిసర ప్రాంతాల్లో భారీ సెట్స్ వేయించారట నిర్మాత. కూనవరంలో ఈ రెండు కుటుంబాలు ఉన్నట్టు తెరపై చూపించబోతున్నారు. అలాగే ఈ కుటుంబాలకి సంబంధించి వచ్చే పెళ్లి సన్నివేశాల కోసం నెలరోజుల పాటు అక్కడ చిత్రీకరణ జరుపనున్నారని.. ప్రధాన పాత్రధారులంతా ఈ చిత్రీకరణలో పాల్గొనున్నారని సమాచారం.
Follow @ Google News: గూగుల్ న్యూస్ పేజీలోని ఇండియాగ్లిట్జ్ తెలుగు వెబ్‌సైట్‌ను అనుసరించడానికి మరియు వెంటనే వార్తలను తెలుసుకోవడాని ఇక్కడ క్లిక్ చేయండి.
-
Contact at support@indiaglitz.com
Comments