‘ఆర్ఆర్ఆర్’... భారీ సెట్
Send us your feedback to audioarticles@vaarta.com
దర్శకధీరుడు రాజమౌళి ప్రతిష్టాత్మకంగా తెరకెక్కిస్తోన్న చిత్రం ‘రౌద్రం రణం రుధిరం(ఆర్ఆర్ఆర్)’. దాదాపు 75 శాతం చిత్రీకరణ పూర్తయ్యింది. ఈ సినిమా కీలక షెడ్యూల్‌ను పూణేలో చిత్రీకరించాలని అనుకుంటున్న తరుణంలో లాక్డౌన్ కారణంగా షూటింగ్ ఆగిపోయింది. దాదాపు రెండు నెలలుగా ఈ సినిమాతో పాటు దేశంలోని అన్నీ సినిమాల షూటింగ్స్ ఆగిపోయాయి. ఇప్పుడు తెలుగు సినీ పెద్దలు సినిమాల షూటింగ్స్‌ను పునః ప్రారంభించడానికి సన్నాహాలు చేసుకుంటున్నారు. ప్రభుత్వం నుండి విధివిధానాలు రాగానే సినిమాలన్నీ సెట్స్ పైకి వెళతాయి. అయితే అన్నీ సినిమాలకంటే తన ‘ఆర్ఆర్ఆర్’నే స్టార్ట్ చేయాలని రాజమౌళి భావిస్తున్నాడట. ఈ షెడ్యూల్‌ను గండిపేటలోనే చిత్రీకరించబోతున్నారట. అందుకోసం రూ.18 కోట్ల ఖర్చుతో భారీ సెట్‌ను వేస్తున్నారట.
టాలీవుడ్ అగ్ర కథానాయకులు యంగ్ టైగర్ ఎన్టీఆర్, మెగాపవర్‌స్టార్ రామ్‌చరణ్ హీరోలుగా నటిస్తోన్న ఈ చిత్రంలో అజయ్ దేవగణ్, ఆలియా భట్ సహా రే స్టీవెన్ సన్, అలిసన్ డూడీ, ఒలివియా మోరిస్ తదితరులు నటిస్తున్నారు. ఈ సినిమా మోషన్ పోస్టర్‌కు, భీమ్ఫర్ రామరాజు వీడియోకు ప్రేక్షకుల నుండి అద్భుతమైన స్పందన వచ్చింది. వచ్చే ఏడాదిన ఈ సినిమాను విడుదల చేయడానికి సన్నాహాలు చేసుకుంటున్నారు.
Follow @ Google News: గూగుల్ న్యూస్ పేజీలోని ఇండియాగ్లిట్జ్ తెలుగు వెబ్‌సైట్‌ను అనుసరించడానికి మరియు వెంటనే వార్తలను తెలుసుకోవడాని ఇక్కడ క్లిక్ చేయండి.
-
Devan Karthik
Contact at support@indiaglitz.com
Comments