'నేల టిక్కెట్టు' కోసం భారీ సెట్‌

  • IndiaGlitz, [Sunday,March 18 2018]

సోలో హీరోగా కెరీర్‌ను మొద‌లుపెట్టిన‌ప్ప‌టి (1999) నుంచి 2015 వ‌ర‌కు ప్రతీ ఏడాది కనీసం ఒక సినిమా ఉండేట్టు ప్లాన్ చేసుకున్నారు మాస్ మహారాజా రవితేజ. అయితే.. 2016లో ఒక్క సినిమా కూడా ర‌వితేజ నుంచి రాలేదు. దాదాపు రెండు సంవత్సరాల గ్యాప్ తర్వాత గత ఏడాది అక్టోబరులో  ‘రాజా ది గ్రేట్’తో  ప్రేక్షకుల ముందుకు వచ్చిన రవితేజ.. ఆ చిత్రంతో విజయాన్ని అందుకున్నారు. ఇక ఈ ఏడాది ఆరంభంలో ‘టచ్ చేసి చూడు’తో సందడి చేశారు.

రెండు సంవత్సరాల గ్యాప్‌ను అభిమానులు మరచిపోయే విధంగా.. వరుస  సినిమాల(కళ్యాణ్ కృష్ణ, శ్రీనువైట్ల, వి.ఐ.ఆనంద్, సంతోష్ శ్రీనివాస్ చిత్రాలు)తో కెరీర్‌ను పరుగులు పెట్టిస్తున్నారు ఈ మాస్ హీరో. ఇదిలా ఉంటే.. రవితేజలో ఎనర్జీని దృష్టిలో పెట్టుకుని మాస్ ప్రేక్షకులతో పాటు.. ఫ్యామిలీ ఆడియన్స్‌కు కూడా కనెక్ట్ అయ్యే విధంగా దర్శకుడు కళ్యాణ్ కృష్ణ ‘నేల టిక్కెట్టు’  సినిమాను రూపొందిస్తున్నారు. ప్రస్తుతం ఈ చిత్రం రామోజీ ఫిల్మ్ సిటీలో చిత్రీకరణ జరుపుకుంటోంది.  ఫిలిం సిటీలో వేసిన భారీ సెట్‌లో ప్రధాన పాత్రల మధ్య సాగే కొన్ని కీలక సన్నివేశాలను తెరకెక్కించనున్నారు. ఏప్రిల్ చివరినాటికి షూటింగ్ పూర్తి చేసి.. మే 24కి చిత్రాన్ని విడుదల చేయ‌డానికి స‌న్నాహాలు జ‌రుగుతున్నాయి.

More News

సుమంత్ 25వ చిత్రం 'సుబ్రహ్మణ్యపురం' ప్రారంభం

ఇటీవల మళ్ళీ రావా వంటి ఓ వైవిధ్యమైన చిత్రంతో విజయాన్ని అందుకున్న ప్రామిసింగ్  హీరో సుమంత్

పంచె కట్టుతో కనువిందు చేస్తున్న సూపర్‌స్టార్‌ మహేష్‌

సూపర్‌స్టార్‌ మహేష్‌బాబు, సూపర్‌ డైరెక్టర్‌ కొరటాల శివ కాంబినేషన్‌లో

నాగశౌర్య హీరోగా ఐరా క్రియేషన్స్ నిర్మాణంలో @నర్తనశాల చిత్రం ప్రారంభం

ఛలో చిత్రంతో బ్లాక్ బస్టర్ హిట్ కొట్టిన ఐరా క్రియేషన్స్ నాగశౌర్య హీరోగా

సంగీత దర్శకురాలు యం యం శ్రీలేఖ కు 'కళారత్న' పురస్కారం

ఆంధ్ర ప్రదేశ్ ప్రభుత్వం ఉగాది పండుగ నాడు ఇచ్చే ప్రతిష్టాత్మక 'కళారత్న ' పురస్కారం

'జంబ ల‌కిడి పంబ‌' లోగో విడుద‌ల చేసిన అల్ల‌రి న‌రేశ్‌

శ్రీనివాస్‌రెడ్డి, సిద్ధి ఇద్నాని హీరో హీరోయిన్లుగా శివం సెల్యూలాయిడ్స్‌, మెయిన్ లైన్ ప్రొడ‌క్ష‌న్స్ బ్యాన‌ర్స్‌పై