నాని సినిమా కోసం భారీ సెట్.. ఖర్చెంతో తెలుసా?
Send us your feedback to audioarticles@vaarta.com
నేచురల్ స్టార్ నాని ప్రస్తుతం వరుస సినిమాలకు ఓకే చెబుతున్నారు. ఇప్పటికే శివ నిర్వాణ దర్శకత్వంలో ‘టక్ జగదీష్’ సినిమాను పూర్తి చేసిన సంగతి తెలిసిందే. ప్రస్తుతం రాహుల్ సంక్రిత్యాన్ దర్శకత్వంలో రూపొందుతోన్న శ్యామ్ సింగరాయ్ సినిమాలో నాని టైటిల్ పాత్రధారిగా నటిస్తున్నాడు. నాని కెరీర్లోనే హయ్యస్ట్ బడ్జెట్‌తో సినిమా తెరకెక్కుతోంది. ఈ సినిమాలో నానిలో మూడు షేడ్స్‌లో కనపడబోతున్నాడని టాక్ వినిపిస్తోంది. అలాగూ సినిమాలో రెండు ప్రేమకథలుంటాయి. అందులో ఓ ప్రేమకథ హైదరాబాద్‌లో మరో ప్రేమకథ కోల్‌కతా బ్యాక్‌డ్రాప్‌లో రన్ అవుతుంది.
ఇప్పుడున్న పరిస్థితుల రీత్యా ఇప్పుడు కోల్‌కత్త వెళ్లి అక్క సన్నివేశాలను చిత్రీకరించడం కంటే.. హైదరాబాద్‌లో సెట్ వేసి చేయాలనుకుంటున్నారట. దీని కోసం భారీ మొత్తంలో ఖర్చు పెట్టి పదిహేను ఎకరాల స్థలంలో హైదరాబాద్ శివారు ప్రాంతాల్లో ఓ పెద్ద సెట్ వేస్తున్నారని టాక్. ఇప్పుడు హైదరాబాద్ షెడ్యూల్‌ను పూర్తి చేసి కోల్‌కత్తా సన్నివేశాలను మార్చి నుండి చిత్రీకరిస్తారట. ఈ చిత్రంలో సాయిపల్లవి, క్రితి శెట్టి, మడోన్నా సెబాస్టియన్ హీరోయిన్స్‌గా నటిస్తున్నారు. నిహారిక ఎంటర్‌టైన్‌మెంట్స్ బ్యానర్‌పై వెంకట బోయనపల్లి ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు.
Follow @ Google News: గూగుల్ న్యూస్ పేజీలోని ఇండియాగ్లిట్జ్ తెలుగు వెబ్‌సైట్‌ను అనుసరించడానికి మరియు వెంటనే వార్తలను తెలుసుకోవడాని ఇక్కడ క్లిక్ చేయండి.
Comments
- logoutLogout
-
Devan Karthik
Contact at support@indiaglitz.com