నాని సినిమా కోసం భారీ సెట్‌.. ఖ‌ర్చెంతో తెలుసా?

  • IndiaGlitz, [Thursday,January 07 2021]

నేచురల్ స్టార్ నాని ప్ర‌స్తుతం వ‌రుస సినిమాల‌కు ఓకే చెబుతున్నారు. ఇప్ప‌టికే శివ నిర్వాణ ద‌ర్శ‌క‌త్వంలో ‘ట‌క్ జ‌గ‌దీష్’ సినిమాను పూర్తి చేసిన సంగతి తెలిసిందే. ప్రస్తుతం రాహుల్ సంక్రిత్యాన్ దర్శకత్వంలో రూపొందుతోన్న శ్యామ్ సింగరాయ్ సినిమాలో నాని టైటిల్ పాత్రధారిగా నటిస్తున్నాడు. నాని కెరీర్లోనే హయ్యస్ట్ బడ్జెట్‌తో సినిమా తెరకెక్కుతోంది. ఈ సినిమాలో నానిలో మూడు షేడ్స్‌లో క‌న‌ప‌డ‌బోతున్నాడని టాక్ వినిపిస్తోంది. అలాగూ సినిమాలో రెండు ప్రేమ‌క‌థ‌లుంటాయి. అందులో ఓ ప్రేమ‌క‌థ హైద‌రాబాద్‌లో మ‌రో ప్రేమ‌క‌థ కోల్‌క‌తా బ్యాక్‌డ్రాప్‌లో ర‌న్ అవుతుంది.

ఇప్పుడున్న ప‌రిస్థితుల రీత్యా ఇప్పుడు కోల్‌క‌త్త వెళ్లి అక్క స‌న్నివేశాల‌ను చిత్రీక‌రించ‌డం కంటే.. హైద‌రాబాద్‌లో సెట్ వేసి చేయాల‌నుకుంటున్నార‌ట‌. దీని కోసం భారీ మొత్తంలో ఖ‌ర్చు పెట్టి ప‌దిహేను ఎక‌రాల స్థ‌లంలో హైద‌రాబాద్ శివారు ప్రాంతాల్లో ఓ పెద్ద సెట్ వేస్తున్నార‌ని టాక్‌. ఇప్పుడు హైద‌రాబాద్ షెడ్యూల్‌ను పూర్తి చేసి కోల్‌క‌త్తా స‌న్నివేశాల‌ను మార్చి నుండి చిత్రీక‌రిస్తార‌ట‌. ఈ చిత్రంలో సాయిప‌ల్ల‌వి, క్రితి శెట్టి, మ‌డోన్నా సెబాస్టియ‌న్ హీరోయిన్స్‌గా న‌టిస్తున్నారు. నిహారిక ఎంట‌ర్‌టైన్‌మెంట్స్ బ్యాన‌ర్‌పై వెంక‌ట బోయ‌న‌ప‌ల్లి ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు.

More News

కేసీఆర్‌కు యశోదాలో వైద్య పరీక్షలు..

ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్ రావు గురువారం మధ్యాహ్నం రెండున్నర గంటలకు సికింద్రాబాద్‌లోని యశోదా హాస్పిటల్ లో వైద్య పరీక్షలు చేయించుకోనున్నారు.

ప్రభాస్ కోసం ఆ బాలీవుడ్ స్టార్ దిగుతున్నాడా..?

ప్ర‌భాస్ ప్యాన్ ఇండియా స్టార్‌గా మారిన త‌ర్వాత ఆయ‌న కోసం ద‌ర్శ‌క నిర్మాత‌లు క్యూ క‌డుతున్నారు.

ర‌కుల్ ఆ స్టార్‌ను బుట్ట‌లో వేసుకుందా?

తెలుగు, తమిళ, హిందీ చిత్రాల్లో నటించి హీరోయిన్‌గా తనకంటూ ఓ ప్రత్యేకమైన గుర్తింపును సంపాదించుకుంది రకుల్‌ ప్రీత్‌ సింగ్.

మంత్రి సబిత కుమారుడి పేరుతో తెలుగు రాష్ట్రాల్లో భారీ మోసం..

తెలంగాణ విద్యా శాఖ మంత్రి సబితా ఇంద్రారెడ్డి మూడో కుమారుడైన కళ్యాణ్ రెడ్డి పేరుతో మోసాలకు పాల్పడుతున్న ఆదిలాబాద్ టౌన్‌కి చెందిన ప్రవీణ్ కుమార్

మొదటి మహిళ హైకోర్టు సీజేగా హిమా కోహ్లీ ప్రమాణం..

తెలంగాణ హైకోర్టు చీఫ్‌ జస్టిస్‌గా హిమా కోహ్లీ నేడు ప్రమాణ స్వీకారం చేశారు. రాజ్ భవన్‌లో చీఫ్ జస్టిస్ హిమా కోహ్లీతో గవర్నర్ తమిళ సై ప్రమాణ స్వీకారం చేయించారు.