‘ఆచార్య’ కోసం రూ.20 కోట్లతో భారీ సెట్...
Send us your feedback to audioarticles@vaarta.com
మెగాస్టార్ చిరంజీవి, కొరటాల శివ కాంబినేషన్లో రూపొందుతున్న సినిమా 'ఆచార్య'. ఈ కాంబినేషన్ ప్రకటించినప్పటి నుంచే సినిమాపై బీభత్సమైన హైప్ క్రియేట్ అయింది. కాగా.. ఈ సినిమా షూటింగ్ లాక్డౌన్ తర్వాత తాజాగా పునః ప్రారంభమైంది. అయితే ఈ సినిమా గురించి ఓ ఆసక్తికర వార్త ఫిలింగనర్‌లో హల్చల్ చేస్తోంది. ఈ సినిమా కోసం ఓ భారీ సెట్‌ను రూపొందిస్తున్నారని సినీ వర్గాల్లో వార్తలు వినిపిస్తున్నాయి. హైదరాబాద్‌లోనే ఈ సెట్‌ను వేసినట్టు తెలుస్తోంది.
రూ.20 కోట్ల ఖర్చుతో ఈ సెట్ వేస్తున్నారని సమాచారం. మొత్తంగా 16 ఎకరాల్లో ఈ భారీ సెట్ రూపొందుతోందని ప్రచారం జరుగుతోంది. ఈ సెట్లో సినిమాకు సంబంధించిన మేజర్ షెడ్యూల్‌ను పూర్తి చేయనున్నారని టాక్ నడుస్తోంది. కాగా.. ఈ సినిమా కోసం చిత్ర యూనిట్ వేస్తున్న రెండో భారీ సెట్ కావడం విశేషం. గతంలో ఈ సినిమాకు సంబంధించిన షెడ్యూల్లో కూడా నాలుగు కోట్ల రూపాయలు ఖర్చు పెట్టి గుడి సెట్ వేసి చిత్రీకరణ చేశారు. ఈ గుడి ఆధారంగానే ఈ చిత్రం తెరకెక్కుతున్నట్టు సమాచారం.
దేవాదాయశాఖలో జరిగే అవినీతి, అక్రమాలపై మెగాస్టార్ పోరాడనున్నట్టు తెలుస్తోంది. చిరంజీవి ఈ చిత్రంలో మాజీ నక్సలైట్ పాత్రలో నటిస్తున్నారు. కాగా.. మెగా పవర్ స్టార్ రామ్‌చరణ్ నక్సలైట్ నాయకుడిగా కనిపించనున్నారని టాక్ నడుస్తోంది. కాజల్ అగర్వాల్ హీరోయిన్గా నటిస్తుంది. ఇప్పటికే ఈ సినిమాకు సంబంధించి విడుదలైన అప్డేట్స్ సినిమాపై బీభత్సమైన హైప్‌ను క్రియేట్ చేశాయి. ఈ సినిమా విడుదల కోసం చిరు అభిమానులు ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు.
Follow @ Google News: గూగుల్ న్యూస్ పేజీలోని ఇండియాగ్లిట్జ్ తెలుగు వెబ్‌సైట్‌ను అనుసరించడానికి మరియు వెంటనే వార్తలను తెలుసుకోవడాని ఇక్కడ క్లిక్ చేయండి.
-
Devan Karthik
Contact at support@indiaglitz.com
Comments