'మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచ్ లర్' ఫస్ట్ లుక్ కి అనూహ్యమైన స్పందన
Send us your feedback to audioarticles@vaarta.com
అఖిల్ అక్కినేని హీరోగా మెగా ప్రొడ్యూసర్ అల్లు అరవింద్ సమర్పణలో జీఏ2 పిక్చర్స్ బ్యానర్ పై తెరకెక్కుతున్న మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచ్ లర్ ఫస్ట్ లుక్ విడుదలైంది. తాజాగా ఈ సినిమా టైటిల్ ఎనౌన్స్ చేయగానే సినిమా అభిమానులు నుంచి సాధరణ ప్రేక్షకులు వరకు విపరీతమైన పాజిటివ్ రెస్పాన్స్ రావడమే కాకుండా సోషల్ మీడియాలో ట్రేండింగ్ అవ్వడం ఈ సినిమాకి మీద ఉన్న క్రేజ్ ని తెలియజేస్తుంది. ఇక అక్కినేని నట వారసుడిగా హ్యాండ్ సమ్ హీరో అఖిల్ వైవిధ్యమైన కథలు ఎంచుకుంటూ ఇటీవలే మిస్టర్ మజ్ను, హలో వంటి బ్యాక్ టు బ్యాక్ బ్లాక్ బస్టర్స్ సొంతం చేసుకున్న విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో అఖిల్ మరోసారి తన ఫ్యాన్స్ కి ఫుల్ కిక్ ఇచ్చే స్టోరీతో మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచ్ లర్ గా రాబోతున్నాడు. ఈ చిత్రాన్ని బొమ్మరిల్లు భాస్కర్ దర్శకత్వం లో నిర్మాతలు బన్నీవాసు , వాసు వర్మ సంయుక్తంగా నిర్మిస్తున్న సంగతి తెలిసిందే. అలానే ఈ చిత్రంలో అఖిల్ సరసన పూజా హెగ్డే హీరోయిన్ గా నటిస్తోంది. అఖిల్, పూజా హెగ్ధే మధ్య నడిచే కెమిస్ట్రీ ఈ సినిమాకి ప్రత్యేక ఆకర్షణగా నిలవబోతుందని దర్శకనిర్మాతలు తెలిపారు. ఈ చిత్రంలో అఖిల్ అక్కినేని ఫస్ట్ లుక్ ని ఈ రోజు చిత్ర నిర్మాతలు విడుదల చేశారు.
ఫిబ్రవరి 15 నుంచి తదుపరి షెడ్యూల్
మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచ్ లర్ చిత్ర షూటింగ్ ఇప్పటికే శరవేగంగా జరుగుతుంది. హైదరాబాద్, అమెరికా తదితర ప్రాంతాల్లో ఇప్పిటికే షూటింగ్ జరుపుకున్న ఈ చిత్ర యూనిట్ అదే ఉత్సాహాంతో ఫిబ్రవరి 15 నుంచి మరో షెడ్యూల్ మొదలపెట్టబోతున్నారు.ఈ షెడ్యూల్ లో మేజర్ టాకీ పార్ట్ పూర్తిచేస్తున్నట్లుగా చిత్ర యూనిట్ తెలిపారు.
గోపీ సుందర్ మ్యూజికల్ మ్యాజిక్
జీఏ 2 బ్యానర్ తో గోపీ సుందర్ ఉన్న జర్నీ గురించి అందరికీ తెలిసిందే. గతంలో జీఏ2 బ్యానర్ లో రిలీజైన గీతగోవిందం సినిమాకి గోపీ అద్భుతమైన బ్లాక్ బస్టర్ సంగీతం ఇచ్చారు. ఈ నేపథ్యంతోనే ఇప్పుడు మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచ్ లర్ కి ఆరు పాటలు రెడీ చేశారు గోపీ సుందర్. ఈ ఆరు పాటల్లో నాలుగు పాటలు ఇప్పటికే షూటింగ్ పూర్తి చేసినట్లుగా చిత్ర బృందం తెలిపింది. అలానే మిగతా రెండు పాటలు ఫారిన్ లో చిత్రీకరణకు ప్లాన్ చేస్తున్నట్లుగా తెలిపారు.
వరుస విజయాలతో దూసుకుపోతున్న జీఏ2
పిల్లా నువ్వు లేని జీవితం, భలే భలే మగాడివోయ్, గీతగోవిందం, ప్రతిరోజూ పండగే వంటి టాలీవుడ్ ట్రెండ్ సెట్టింగ్ బ్లాక్ బస్టర్స్ అందించిన యంగ్ ఇంటిల్జెంట్ ప్రొడ్యూసర్ బన్ని వాసు మరోసారి అదే ఉత్సాహాంతో బొమ్మరిల్లు భాస్కర్ దర్వకత్వంలో అఖిల్ అక్కినేని హీరోగా నిర్మిస్తున్న సినిమా మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచ్ లర్. అలానే ఈ చిత్రాన్ని లెజండరీ ప్రోడ్యూసర్ అల్లు అరవింద్ గారి సమర్పణలో నిర్మాత వాసు వర్మతో కలిసి బన్ని వాసు సంయుక్తంగా నిర్మించడం విశేషం. ఇక ఈ సినిమాను ఏప్రిల్ లో విడుదల చేయడానికి సన్నాహాలు చేస్తున్నారు.
Follow @ Google News: గూగుల్ న్యూస్ పేజీలోని ఇండియాగ్లిట్జ్ తెలుగు వెబ్‌సైట్‌ను అనుసరించడానికి మరియు వెంటనే వార్తలను తెలుసుకోవడాని ఇక్కడ క్లిక్ చేయండి.
Comments
- logoutLogout
-
Devan Karthik
Contact at support@indiaglitz.com