'బెంగాల్ టైగర్' అడ్వాన్స్ బుకింగ్ కి భారీక్రేజ్
Send us your feedback to audioarticles@vaarta.com
మాస్‌మహరాజ్ రవితేజ, అందాల భామలు తమన్నా, రాశిఖన్నాలు జంటగా, సంపత్ నంది దర్వకత్వంలో, నిర్మాత కె కె రాధామోహన్ శ్రీ సత్యసాయి ఆర్ట్స్ బ్యానర్లో నిర్మించిన చిత్రం బెంగాల్‌టైగర్ ప్రపంచవ్యాప్తంగా డిసెంబర్ 10న విడుదలవుతుంది. సత్యసాయి ఆర్ట్స్ బ్యానర్లో వచ్చిన ప్రతిచిత్రం కూడా ప్రమెషన్ పరంగా దూసుకువెల్లటమే కాకుండా వినూత్నంగా ప్రమోట్ చేయటం ఈ సంస్థకి పెట్టింది పేరు.
ఇప్పటికే ప్రమోషన్ లో దూసుకుపోతున్న బెంగాల్ టైగర్ చిత్రం మేజర్ గా అన్ని సిటీస్ లో అడ్వాన్స్ బుకింగ్ ఓపెన్ చేశారు. ఓపెన్ చేసిన అన్ని చోట్లా విపరీతంగా ఫాస్ట్ ఫిల్లింగ్ అవుతుండటం ఈ సినిమాకి వున్న క్రేజ్ ని తెలియజేస్తుంది. అందరి అంచనాలు అందుకుని మెదటిరోజు భారీ వసూళ్ళ వైపు వెల్లనుందని ట్రేడ్ వర్గాలు అంచనాలున్నాయి..
ఈ చిత్రలో మాస్‌మహరాజ్ రవితేజ, తమన్నా, రాశిఖన్నా, బోమన్ ఇరాని, బ్రహ్మనందం, రావు రమేష్, షియాజి షిండే, నాజర్, పోసాని కృష్ణమురళి, తనికెళ్ళ భరణి, హర్హవర్ధన్ రానే, పృద్వి, సురేఖ వాణి, అక్ష, శ్యామల, ప్రియ, ప్రభు, ప్రగతి, నాగినీడు, ప్రభ, రమాప్రభ తదితరులు నటించగా..బ్యానర్ : శ్రీ సత్యసాయి ఆర్ట్స్, కెమెరా: సౌందర్ రాజన్, ఎడిటర్: గౌతం రాజు, ఆర్ట్: డి,వై.సత్యనారాయణ, ఫైట్స్: రామ్-లక్ష్మణ్, సంగీతం భీమ్స్ నిర్మాత: కె.కె.రాధామెహన్, కథ-మాటలు-స్ర్కీన్‌ప్లే-దర్శకత్వం: సంపత్ నంది.
Follow @ Google News: గూగుల్ న్యూస్ పేజీలోని ఇండియాగ్లిట్జ్ తెలుగు వెబ్‌సైట్‌ను అనుసరించడానికి మరియు వెంటనే వార్తలను తెలుసుకోవడాని ఇక్కడ క్లిక్ చేయండి.
Comments
- logoutLogout
-
Contact at support@indiaglitz.com