ఉప్పెన బ్యూటీ సెన్సేషనల్ డీల్.. జీ నెట్వర్క్ నుంచి భారీ రెమ్యునరేషన్!
Send us your feedback to audioarticles@vaarta.com
ఉప్పెన హీరోయిన్ కృతి శెట్టి క్రేజ్ రోజు రోజుకు తారాస్థాయికి చేరుతోంది. ఉప్పెన చిత్రంలో ఈ యంగ్ బ్యూటీ యువతని మాయ చేసిన సంగతి తెలిసిందే. కృతి శెట్టి క్రేజ్ దృష్ట్యా ఆమెకు అద్భుతమైన అవకాశాలు అందుతున్నాయి. భారీ రెమ్యునరేషన్స్ తో నిర్మాతలు కృతి శెట్టిని తమ చిత్రాలకు ఒకే చేయించుకుంటున్నారు.
ఇదీ చదవండి: రెజీనా, నివేద రీమేక్ మూవీ అప్డేట్.. ఇంట్రెస్టింగ్ డీటెయిల్స్ ఇవిగో!
తాజాగా కృతి శెట్టి సెన్సేషనల్ డీల్ తో వార్తల్లో నిలిచింది. జీ నెట్వర్క్ సంస్థ కృతి శెట్టికి రూ. కోటి రెమ్యునరేషన్ ఇచ్చేందుకు రెడీ అయినట్లు టాక్. ఆమేరకు కృతి శెట్టి, జీటివి మధ్య డీల్ కుదిరిందట. జీటివి సీరియల్స్ కి ప్రచారం కల్పించేందుకు, ఈవెంట్స్ లో మెరిసేందుకు ఆ సంస్థ కృతి శెట్టికి అంత రెమ్యునరేషన్ ఇచ్చేందుకు సిద్ధం అయినట్లు టాక్.
జీ టివి తన ప్రోగ్రామ్స్ ప్రచారం బాగా చేసుకుంటుంది. ప్రతి ఏడాది జీటివి నిర్వహించే ఈవెంట్ లో సెలెబ్రిటీలు గెస్ట్ లుగా మెరవడం చూస్తూనే ఉన్నాం. సూపర్ స్టార్ మహేష్ బాబు, రమ్య కృష్ణ లాంటి వారు జీటివి ఈవెంట్ కు అతిథులుగా హాజరయ్యారు. ఈ ఏడాది కృతి శెట్టి హాజరు కాబోతోంది.
కేవలం ఒక్క చిత్రంతోనే కృతి శెట్టి ఎండార్స్మెంట్ లో ఈస్థాయిలో రెమ్యునరేషన్ అందుకోవడం ఇండస్ట్రీ వర్గాలనే ఆశ్చర్యానికి గురిచేస్తోంది. బుచ్చిబాబు దర్శకత్వంలో వచ్చిన ఉప్పెన చిత్రం వసూళ్ల వర్షం కురిపించింది. ఈ చిత్రంలో వైష్ణవ్ తేజ్, కృతి మధ్య కెమిస్ట్రీ అదుర్స్.
ప్రస్తుతం కృతి శెట్టి లింగుస్వామి డైరెక్షన్ లో రామ్ పోతినేని సరసన హీరోయిన్ గా నటిస్తున్న సంగతి తెలిసిందే. నాని శ్యామ్ సింగరాయ్ లో కూడా కృతి శెట్టి హీరోయిన్ నటిస్తోంది.
Follow @ Google News: గూగుల్ న్యూస్ పేజీలోని ఇండియాగ్లిట్జ్ తెలుగు వెబ్‌సైట్‌ను అనుసరించడానికి మరియు వెంటనే వార్తలను తెలుసుకోవడాని ఇక్కడ క్లిక్ చేయండి.
-
Devan Karthik
Contact at support@indiaglitz.com
Comments