నాగీ సినిమాకు ప్రభాస్ 70 కోట్ల పారితోషికం!?
Send us your feedback to audioarticles@vaarta.com
‘బాహుబలి’లాంటి భారీ సినిమాతో వరల్డ్ ఫేమస్ అయిన ప్రభాస్.. ‘మహానటి’ సినిమా తనకంటూ ఓ క్రేజ్ దక్కించుకున్న నాగ్ అశ్విన్ కాంబోలో సినిమా వస్తున్న సంగతి తెలిసిందే. ఇందుకు సంబంధించి అధికారిక ప్రకటన కూడా వచ్చేసింది. ప్రముఖ నిర్మాణ సంస్థ వైజయంతి మూవీస్ బ్యానర్లో సి.అశ్వినీదత్ భారీ బడ్జెట్‌తో నిర్మించనున్నాడు. అయితే ఈ కాంబోలో సినిమా ఎలా ఉంటుంది..? కథ ఎలా ఉండబోతోంది..? అనేదానిపై ఇటు టాలీవుడ్లో.. అటు సోషల్ మీడియా.. మరీ ముఖ్యంగా ప్రభాస్ అభిమానుల్లో సర్వత్రా చర్చ జరుగుతోంది. మరో వైపు ప్రభాస్ సరిపడే.. డార్లింగ్‌తో రొమాన్స్ చేసే బ్యూటీ ఎవరబ్బా..? టాలీవుడ్ నుంచే తీసుకుంటారా..? లేకుంటే ‘సాహో’కు పట్టుకొచ్చినట్లుగానే బాలీవుడ్ భామనే పట్టుకొస్తారా..? అనే దానిపై సర్వత్రా చర్చనీయాంశంగా మారింది.
గట్టిగానే..!
అయితే తాజాగా.. ప్రభాస్ రెమ్యునరేషన్ విషయంపై అటు టాలీవుడ్లో.. ఇటు సోషల్ మీడియాలో పెద్ద ఎత్తున చర్చ జరుగుతోంది. అయితే.. ప్రభాస్ మాత్రం భారీగానే పుచ్చుకుంటున్నారట. అక్షరాలా డెబ్బై కోట్లు (70 కోట్లు) డిమాండ్ చేయగా.. భారీ సినిమా కాబట్టి నిర్మాత అశ్వనీదత్ ఏ మాత్రం ఆలోచించకుండానే గ్రీన్ సిగ్నల్ ఇచ్చేశారట. అంతేకాదు.. సినిమా షూటింగ్‌కు గ్యాప్ ఇవ్వకూడదని.. ఈ ఏడాది లోపే మూవీ పూర్తి చేయాలని గట్టిగానే డార్లింగ్‌కు నిర్మాత చెప్పారట. అన్నీ అనుకున్నట్లు జరిగితే అతి త్వరలోనే సినిమా షూటింగ్ షురూ చేయాలని నాగీ సన్నాహాలు చేస్తున్నాడట. ఈ పారితోషికం విషయంలో నిజానిజాలెంతో చేయాలంటే అధికారిక ప్రకటన వచ్చేంతవరకూ వేచి చూడాల్సిందే.
Follow @ Google News: గూగుల్ న్యూస్ పేజీలోని ఇండియాగ్లిట్జ్ తెలుగు వెబ్‌సైట్‌ను అనుసరించడానికి మరియు వెంటనే వార్తలను తెలుసుకోవడాని ఇక్కడ క్లిక్ చేయండి.
Comments
- logoutLogout
-
Devan Karthik
Contact at support@indiaglitz.com