బన్నీకి భారీ రెమ్యునరేషన్..?
Send us your feedback to audioarticles@vaarta.com
స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ హీరోగా తన రేంజ్‌ను క్రమంగా పెంచుకుంటూ వస్తున్నారు. ఈ ఏడాది అల వైకుంఠపురములో చిత్రంతో నాన్ బాహుబలి రికార్డులను సాధించిన బన్నీ ఇప్పుడు ‘పుష్ప’తో పాన్ ఇండియా హీరోగా మారే ప్రయత్నం చేస్తున్నాడు. అల్లు అర్జున్‌కు తెలుగుతో పాటు మలయాళంలోనూ మంచి క్రేజ్ ఉంది. ఎప్పటి నుండో తమిళంలో ఎంట్రీ కోసం వెయిట్ చేస్తున్న సమయంలో సుకుమార్ చెప్పిన పుష్ప కథ నచ్చడంతో హిందీలో కూడా హీరోగా పాగా వేయడానికి పాన్ ఇండియా సినిమాను ప్లాన్ చేసేశాడు. ఈ సినిమా కోసం బన్నీ లుక్ పరంగా అంతా సిద్ధంగా ఉన్నాడు. కరోనా ప్రభావం లేకుంటే ఈ పాటికే తొలి షెడ్యూల్ కూడా ఎప్పుడో పూర్తయ్యుండేది. కానీ కరోనా ఎఫెక్ట్‌తో రెగ్యులర్ షూటింగ్ వాయిదా పడింది. త్వరలోనే షూటింగ్ షురూ చేయడానికి బన్నీ అండ్ టీమ్ సిద్ధమవుతున్నారు.
‘పుష్ప’ సినిమా కోసం బన్నీ భారీ రెమ్యునరేషన్ తీసుకుంటున్నారని సోషల్ మీడియాలో వార్తలు షికార్లు చేస్తున్నాయి. ‘అల వైకుంఠపురములో’ చిత్రానికి రూ.25 కోట్లతో పాటు లాభాల్లో 25 శాతం వాటాను బన్నీ తీసుకున్నారని టాక్. ఇప్పుడు ‘పుష్ప’ కోసం రూ.35 కోట్ల రూపాయల రెమ్యునరేషన్‌తో పాటు లాభాల్లో వాటాను తీసుకుంటున్నారని టాక్. మరి ఈ వార్తలపై బన్నీ అండ్ టీం ఎలా రెస్పాండ్ అవుతుందో చూడాలి.
Follow @ Google News: గూగుల్ న్యూస్ పేజీలోని ఇండియాగ్లిట్జ్ తెలుగు వెబ్‌సైట్‌ను అనుసరించడానికి మరియు వెంటనే వార్తలను తెలుసుకోవడాని ఇక్కడ క్లిక్ చేయండి.
-
Devan Karthik
Contact at support@indiaglitz.com
Comments