మహేష్ రెమ్యూనరేషన్ అంత తీసుకుంటున్నాడా..
Send us your feedback to audioarticles@vaarta.com
సూపర్ స్టార్ మహేష్ బాబు తాజాగా బ్రహ్మోత్సవం చిత్రంలో నటిస్తున్నారు. ఈ చిత్రం తర్వాత మహేష్ మురుగుదాస్ మూవీలో నటిస్తున్న విషయం తెలిసిందే. ఈ చిత్రాన్ని ఎన్.వి.ప్రసాద్ అత్యంత ప్రతిష్టాత్మకంగా నిర్మిస్తున్నారు. తెలుగు, తమిళ్, హిందీ భాషల్లో ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. అయితే ఈ చిత్రానికి మహేష్ అక్షరాల 25 కోట్లు రెమ్యూనరేషన్ తీసుకుంటున్నాడట.
టాలీవుడ్ లో ఇంత రెమ్యూనరేష్ తీసుకుంటున్న ఫస్ట్ హీరో మహేష్ బాబు కావడం విశేషం. ఈ చిత్రానికి సంబంధించి ప్రీ ప్రొడక్షన్ వర్క్ జరుగుతుంది. ఏప్రిల్ నుంచి ఈ భారీ చిత్రాన్ని భారీ స్ధాయిలో ప్రారంభించడానికి ఏర్పాట్లు చేస్తున్నారు. ఇంటర్నేషనల్ స్ధాయిలో ఈ చిత్రాన్ని రూపొందించడానికి మురుగుదాస్ పక్కా ప్లాన్ రెడీ చేస్తున్నారు. మరి...రెమ్యూనరేషన్ పరంగా న్యూరికార్డు క్రియేట్ చేసిన సూపర్ స్టార్ మహేష్ సినిమా రిలీజ్ తర్వాత ఎలాంటి రికార్డ్స్ క్రియేట్ చేస్తాడో చూడాలి.
Follow @ Google News: గూగుల్ న్యూస్ పేజీలోని ఇండియాగ్లిట్జ్ తెలుగు వెబ్సైట్ను అనుసరించడానికి మరియు వెంటనే వార్తలను తెలుసుకోవడాని ఇక్కడ క్లిక్ చేయండి.
Comments
- logoutLogout
-
Contact at support@indiaglitz.com