మ‌హేష్ రెమ్యూన‌రేష‌న్ అంత తీసుకుంటున్నాడా..

  • IndiaGlitz, [Monday,November 16 2015]

సూప‌ర్ స్టార్ మ‌హేష్ బాబు తాజాగా బ్ర‌హ్మోత్స‌వం చిత్రంలో న‌టిస్తున్నారు. ఈ చిత్రం త‌ర్వాత మ‌హేష్ మురుగుదాస్ మూవీలో న‌టిస్తున్న విష‌యం తెలిసిందే. ఈ చిత్రాన్ని ఎన్.వి.ప్ర‌సాద్ అత్యంత ప్ర‌తిష్టాత్మకంగా నిర్మిస్తున్నారు. తెలుగు, త‌మిళ్, హిందీ భాష‌ల్లో ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. అయితే ఈ చిత్రానికి మ‌హేష్ అక్ష‌రాల 25 కోట్లు రెమ్యూన‌రేష‌న్ తీసుకుంటున్నాడ‌ట‌.

టాలీవుడ్ లో ఇంత రెమ్యూన‌రేష్ తీసుకుంటున్న ఫ‌స్ట్ హీరో మ‌హేష్ బాబు కావ‌డం విశేషం. ఈ చిత్రానికి సంబంధించి ప్రీ ప్రొడ‌క్ష‌న్ వ‌ర్క్ జ‌రుగుతుంది. ఏప్రిల్ నుంచి ఈ భారీ చిత్రాన్ని భారీ స్ధాయిలో ప్రారంభించ‌డానికి ఏర్పాట్లు చేస్తున్నారు. ఇంట‌ర్నేష‌నల్ స్ధాయిలో ఈ చిత్రాన్ని రూపొందించ‌డానికి మురుగుదాస్ ప‌క్కా ప్లాన్ రెడీ చేస్తున్నారు. మ‌రి...రెమ్యూన‌రేష‌న్ ప‌రంగా న్యూరికార్డు క్రియేట్ చేసిన సూప‌ర్ స్టార్ మ‌హేష్ సినిమా రిలీజ్ త‌ర్వాత ఎలాంటి రికార్డ్స్ క్రియేట్ చేస్తాడో చూడాలి.

More News

బెంగాల్ టైగ‌ర్ రిలీజ్ వాయిదా..

మాస్ రాజా ర‌వితేజ న‌టించిన‌ తాజా చిత్రం బెంగాల్ టైగ‌ర్. ఈ చిత్రాన్ని సంప‌త్ నంది తెర‌కెక్కించారు.

సైజ్ జీరో సెల‌బ్రిటీల లిస్ట్

లావుగా ఉన్న అమ్మాయికి పెళ్లి కాకపోతే ఆమె తల్లి ఎంతో బాధపడుతుంది. పెళ్లి చేసుకోవడం కోసం తగ్గే సన్నాహాల్లో ఉన్న అమ్మాయి ఏం చేసింది? అనే కాన్సెప్టుతో తెరకెక్కిన సినిమా సైజ్ జీరో.

నిర్మాత‌ల హీరో, వ‌ర్క్ హాలిక్‌...నారా రోహిత్‌

తొలిచిత్రం ‘బాణం’ నుండి విల‌క్ష‌ణ చిత్రాల్లో నటిస్తూ ప్రేక్ష‌కుల‌ను మెప్పించిన యంగ్ హీరో నారా రోహిత్. ‘సోలో, ప్ర‌తినిధి, రౌడీ ఫెలో, అసుర’ చిత్రాల‌తో మంచి విజ‌యాల‌ను త‌న ఖాతాలో వేసుకున్నారు.

ప్ర‌భాస్ గోల్డెన్ హార్ట్

కుడి చేత్తో చేసే దానం ఎడం చేతికి కూడా తెలియ‌కూడ‌ద‌ని అంటారు. ఆ విష‌యాన్ని తూచా త‌ప్ప‌కుండా పాటించాల‌న్న‌ది ప్ర‌భాస్ సిద్ధాంతం.

'ఐతే' రీబూట్ వెర్షన్ 'ఐతే 2.0/పైరేట్స్‌ 1.0' - దర్శకుడు రాజ్ మాదిరాజ్

ఇంద్రనీల్‌ సేన్‌ గుప్తా, జారాషా, అభిషేక్‌, కర్తవ్య శర్మ, నీరజ్‌, మృణాల్‌, మృదాంజలి ప్రధాన తారాగణంగా రూపొందుతున్న సినిమా ‘ఐతే2.0/పైరేట్స్ 1.0’. ఫర్మ్‌ 9 బ్యానర్‌పై రాజ్ మాదిరాజ్ దర్శకత్వం తెరకెక్కుతోంది.