ఫ్యాన్సీ రేటుకు వ‌కీల్‌సాబ్ శాటిలైట్ హ‌క్కులు

  • IndiaGlitz, [Friday,January 15 2021]

ప‌వ‌ర్‌స్టార్ ప‌వ‌న్‌కళ్యాణ్ టైటిల్ పాత్ర‌లో న‌టిస్తోన్న చిత్రం ‘వ‌కీల్ సాబ్‌’. ప్ర‌ముఖ నిర్మాత బోనీ క‌పూర్ స‌మ‌ర్ప‌ణ‌లో శ్రీ వెంక‌టేశ్వ‌ర క్రియేష‌న్స్‌, బే వ్యూ ప్రాజెక్ట్స్ ప‌తాకాల‌పై దిల్‌రాజు, శిరీష్ ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. సంక్రాంతి సంద‌ర్భంగా విడుద‌లైన ఈ టీజ‌ర్ సోష‌ల్ మీడియాలో సెన్సేష‌న్ క్రియేట్ చేస్తోంది. వ్యూస్ మిలియ‌న్స్ దాటుతున్నాయి. మ‌రి ఎలాంటి రికార్డుల‌ను క్రియేట్ చేస్తుందో తెలియాలంటే కొంత స‌మయం ఆగ‌క త‌ప్ప‌దు. లేటెస్ట్ స‌మాచారం ప్ర‌కారం వ‌కీల్ సాబ్ శాటిలైట్ హ‌క్కుల‌ను ప‌దిహేను కోట్ల రూపాయ‌ల‌కు ఇచ్చేశార‌ని వార్త‌లు వినిపిస్తున్నాయి. మ‌రి సినిమా విడుద‌ల స‌మ‌యంలో సినిమా బిజినెస్ ఎలాంటి రికార్డుల‌ను క్రియేట్ చేయ‌నుందో మ‌రి.

‘వ‌కీల్ సాబ్’ సినిమా కోసం ప‌వ‌న్ చాలా త‌క్కువ రోజులే కాల్షీట్స్ ఇచ్చాడు. సినిమాను తొందరగానే ముగించేయాల‌ని ద‌ర్శ‌కుడు వేణు శ్రీరామ్‌, నిర్మాత‌లు అనుకున్నారు. కానీ కోవిడ్ ఎఫెక్ట్‌తో సినిమా ఆరేడు నెల‌లు ఆగిపోయింది. ఏమీ చేయ‌లేని ప‌రిస్థితి మ‌ళ్లీ రీసెంట్‌గానే షూటింగ్‌ను స్టార్ట్‌చేసింది యూనిట్ ఏదైతేనేం చాలా త్వ‌ర‌త్వ‌ర‌గా సినిమాను పూర్తి చేసుకుంటూ వ‌చ్చారు. ప్ర‌స్తుతం పోస్ట్ ప్రొడ‌క్ష‌న్ ప‌నులు జ‌రుగుతున్నాయి. ఏప్రిల్ 9న సినిమాను విడుద‌ల చేసే అవ‌కాశాలున్నాయ‌ని టాక్ వినిపిస్తోంది.