‘తలైవి’ కోసం భారీ ప్రైజ్
Send us your feedback to audioarticles@vaarta.com
తమిళనాడు దివంగత ముఖ్యమంత్రి జయలలిత జీవితాన్ని ఆధారంగా చేసుకుని రూపొందుతోన్న చిత్రం `తలైవి`. బాలీవుడ్‌క్వీన్ కంగనా రనౌత్ టైటిల్ పాత్రలో నటిస్తున్నారు. ఈ చిత్రం చిత్రీకరణ దశలో ఉంది. పాన్ ఇండియా చిత్రంగా తెలుగు, తమిళ, హిందీ భాషల్లో విడుదల కానుంది. ఈ చిత్రంలో దివంగత రాజకీయ నాయకుడు ఎం.జి.రామచంద్రన్ పాత్రలో ప్రముఖ నటుడు అరవింద స్వామి నటిస్తుండగా మరో దివంగత నేత కరుణానిధి పాత్రలో ప్రకాశ్‌రాజ్ నటిస్తున్నారు. డైరెక్టర్ ఎ.ఎల్.విజయ్ దర్శకత్వంలో రూపొందుతోన్న ఈ చిత్రాన్ని విష్ణు ఇందూరి, శైలే్ ఆర్.సింగ్ నిర్మిస్తున్నారు. బ్లేడ్ రన్నర్, కెప్టెన్ మార్వెల్ వంటి హాలీవుడ్ చిత్రాలకు మేకప్ మేన్‌గా వ్యవహరించిన జాసన్ కొలిన్స్ ఈ చిత్రంలో కంగనా రనౌత్‌ను జయలలితగా చూపిస్తున్నారు.
లేటెస్ట్ సమాచారం మేరకు ఈ సినిమాకు ఉన్న క్రేజ్ దృష్ట్యా డిజిటల్ మీడియా సంస్థలైన అమెజాన్, నెట్‌ఫ్లిక్స్ సంస్థలు కలిసి భారీ రేటు చెల్లించి డిజిటల్ హక్కులు దక్కించుకున్నాయని వార్తలు వినపడుతున్నాయి. దాదాపు రూ.55 కోట్లను ఈ సంస్థలు చెల్లించాయంటున్నారు.
Follow @ Google News: గూగుల్ న్యూస్ పేజీలోని ఇండియాగ్లిట్జ్ తెలుగు వెబ్‌సైట్‌ను అనుసరించడానికి మరియు వెంటనే వార్తలను తెలుసుకోవడాని ఇక్కడ క్లిక్ చేయండి.
-
Devan Karthik
Contact at support@indiaglitz.com
Comments