‘త‌లైవి’ కోసం భారీ ప్రైజ్‌

  • IndiaGlitz, [Friday,June 05 2020]

త‌మిళ‌నాడు దివంగ‌త ముఖ్య‌మంత్రి జ‌య‌ల‌లిత జీవితాన్ని ఆధారంగా చేసుకుని రూపొందుతోన్న‌ చిత్రం 'త‌లైవి'. బాలీవుడ్‌క్వీన్ కంగ‌నా ర‌నౌత్ టైటిల్ పాత్ర‌లో న‌టిస్తున్నారు. ఈ చిత్రం చిత్రీక‌ర‌ణ ద‌శ‌లో ఉంది. పాన్ ఇండియా చిత్రంగా తెలుగు, త‌మిళ‌, హిందీ భాష‌ల్లో విడుద‌ల కానుంది. ఈ చిత్రంలో దివంగ‌త రాజ‌కీయ నాయ‌కుడు ఎం.జి.రామ‌చంద్ర‌న్ పాత్ర‌లో ప్ర‌ముఖ న‌టుడు అర‌వింద స్వామి న‌టిస్తుండ‌గా మ‌రో దివంగ‌త నేత క‌రుణానిధి పాత్ర‌లో ప్ర‌కాశ్‌రాజ్ న‌టిస్తున్నారు. డైరెక్ట‌ర్ ఎ.ఎల్‌.విజ‌య్ ద‌ర్శ‌క‌త్వంలో రూపొందుతోన్న ఈ చిత్రాన్ని విష్ణు ఇందూరి, శైలే్ ఆర్‌.సింగ్ నిర్మిస్తున్నారు. బ్లేడ్ ర‌న్న‌ర్, కెప్టెన్ మార్వెల్ వంటి హాలీవుడ్ చిత్రాల‌కు మేక‌ప్ మేన్‌గా వ్య‌వ‌హ‌రించిన జాస‌న్ కొలిన్స్ ఈ చిత్రంలో కంగ‌నా ర‌నౌత్‌ను జ‌య‌ల‌లిత‌గా చూపిస్తున్నారు.

లేటెస్ట్ స‌మాచారం మేర‌కు ఈ సినిమాకు ఉన్న క్రేజ్ దృష్ట్యా డిజిట‌ల్ మీడియా సంస్థ‌లైన అమెజాన్‌, నెట్‌ఫ్లిక్స్ సంస్థ‌లు క‌లిసి భారీ రేటు చెల్లించి డిజిట‌ల్ హ‌క్కులు ద‌క్కించుకున్నాయ‌ని వార్త‌లు విన‌ప‌డుతున్నాయి. దాదాపు రూ.55 కోట్ల‌ను ఈ సంస్థ‌లు చెల్లించాయంటున్నారు.

More News

ఒకే సినిమా.. ఇద్ద‌రు ద‌ర్శ‌కులు

గ‌ద్ద‌ల‌కొండ గ‌ణేష్‌, ఎఫ్‌2 చిత్రాల‌తో వ‌రుస హిట్స్ త‌న ఖాతాలో వేసుకున్నాడు మెగాప్రిన్స్ వ‌రుణ్ తేజ్‌. ఇప్పుడు కిర‌ణ్ కొర్ర‌పాటి అనే డెబ్యూ డైరెక్ట‌ర్‌తో క‌లిసి బాక్సింగ్ నేప‌థ్యంలో

డిజిట‌ల్ కోసం చేతులు క‌లుపుతున్న నిర్మాత‌లు

ప్ర‌స్తుతం సినీ ఇండ‌స్ట్రీలో నెల‌కొన్న ప‌రిస్థితులు అంద‌రికీ తెలిసిందే. థియేట‌ర్స్ మూత‌ప‌డ్డాయి. షూటింగ్స్ అన్నీ ఆగిపోయాయి. సినీ పెద్ద‌లు షూటింగ్స్‌ను స్టార్ట్ చేయ‌డానికి ప్ర‌యత్నాలు చేస్తున్నారు.

క్రిష్ మాటలను పవన్ వింటాడా..?

ప‌వ‌ర్‌స్టార్ ప‌వ‌న్‌క‌ల్యాణ్ రీఎంట్రీ త‌ర్వాత వ‌రుస సినిమాల‌కు గ్రీన్ సిగ్న‌ల్ ఇస్తూ వ‌చ్చారు. తొలి చిత్రంగా పింక్ రీమేక్‌గా వ‌కీల్‌సాబ్‌ను సిద్దం చేసే ప్ర‌య‌త్నాల్లో ఉన్నారు.

హర్భజన్ సింగ్ హీరోగా 'ఫ్రెండ్ షిప్' మూవీ ఫ‌స్ట్‌లుక్ విడుద‌ల‌

తన స్పిన్ బౌలింగ్‌తో టీమ్‌ ఇండియాకు ఎన్నో అద్బుతమైన విజయాలను అందించడంలో విశేష కృషి చేసిన ప్ర‌ముఖ క్రికెట‌ర్‌ హర్భజన్ సింగ్ తన సుదీర్ఘ  క్రికెట్ జీవితానికి గుడ్ బై చెప్పి ప్రస్తుతం

తిరుమల వెంకన్నను దర్శించుకోవాలంటే మార్గదర్శకాలు ఇవే..

అఖిలాండ కోటి బ్రహ్మాండ నాయకుడు కొలువైన తిరుమల వెంకన్న సన్నిధిలో లాక్ డౌన్‌లోనూ కైంకర్యాలు జరుగుతున్న విషయం తెలిసిందే.