భారీ ధరకు 'ఎస్3 (సింగం3)' తెలుగు రైట్స్.....

  • IndiaGlitz, [Monday,July 11 2016]

సూర్య, హరి సూపర్ హిట్ కాంబినేషన్ గురించి ప్రత్యేకంగా వివరించనక్లర్లేదు. ముఖ్యంగా వీరి కాంబినేషన్ లో వచ్చిన సింగం', సింగం2' చిత్రాలు భారీ విజయాలను సాధించాయి. ఇప్పుడు మరోసారి వీరి కాంబినేషన్ లో ఈ హిట్ సీక్వెల్ గా సింగం 3' రూపొందనుంది.

అనుష్క, శృతిహాసన్ ఇందులో నటిస్తున్నారు. శృతిహాస‌న్ జ‌ర్న‌లిస్ట్ పాత్ర‌లో న‌టిస్తుంది. సూర్య సినిమా అంటేనే భారీ క్రేజ్ ఉంటుంది. బ‌య్య‌ర్స్ మంచి రేటుకు సినిమాను కొన‌డానికి ప్ర‌య‌త్నిస్తారు. తాజా స‌మాచారం ప్ర‌కారం ఎస్ 3 సినిమా నైజాం,ఆంద్ర డిస్ట్రిబ్యూష‌న్ తెలుగు హ‌క్కుల‌ను మ‌ల్కాపురం శివ‌కుమార్ చేజిక్కించుకున్నార‌ని, అందుకోసం ఆయ‌న 18 కోట్ల రూపాయ‌ల మొత్తాన్ని ఇచ్చార‌ని వార్తలు వస్తున్నాయి. సినిమాను అక్టోబ‌ర్‌లో విడుద‌ల చేయ‌డానికి ప్ర‌య‌త్నాలు చేస్తున్నారు.

More News

హ‌రిత హారం కు అండ‌గా నిలిచిన‌ సినీతార‌లు

తెలంగాణ రాష్ట్ర ప్ర‌భుత్వం అత్యంత ప్ర‌తిష్టాత్మ‌కంగా చేప‌ట్టిన కార్య‌క్ర‌మం హ‌రిత హారం. ఈ కార్య‌క్ర‌మానికి సినీ ప్ర‌ముఖుల నుంచి విశేష స్పంద‌న ల‌భిస్తుంది.

నితిన్, నాని ముఖ్య అతిధులుగా నిత్యామీన‌న్ 100 డేస్ ఆఫ్ ల‌వ్ ఆడియో

ఈనెల 13న విడుద‌ల కానున్న 100డేస్ ఆఫ్ ల‌వ్ ఆడియో ఫంక్ష‌న్ కు నితిన్, నాని ముఖ్య అతిధులుగా రానున్నారు. నాని తో అలా మొద‌లైంది, నితిన్ తో ఇష్క్, గుండెజారి గ‌ల్లంతయ్యిందే  సినిమాల‌తో నిత్య తో జోడీ క‌ట్టిన‌ వీళ్లు ఇప్పుడు నిత్యమీన‌న్ సినిమా ఆడియోను ల‌హ‌రి మ్యూజిక్ ద్వారా మార్కెట్ లోకి విడుద‌ల చేయ‌నున్నారు.

రామ్ తమిళియన్ గెటప్ అందుకా..

తమిళియన్ గెటప్ లోఇలా...వెరైటీగా రామ్ దర్శనమిచ్చారు.

హ‌రిత‌హారంలో త‌న కోరిక బ‌య‌ట‌పెట్టిన బ‌న్ని

తెలంగాణ రాష్ట్ర ప్ర‌భుత్వం చేప‌ట్టిన హ‌రిత‌హారం కార్య‌క్ర‌మంలో ఈరోజు అల్లు ఫ్యామిలీ మెంబ‌ర్స్ అల్లు అర‌వింద్, అల్లు అర్జున్,  బ‌న్ని భార్య స్నేహ‌, బ‌న్ని త‌న‌యుడు అయాన్ త‌దిత‌రులు పాల్గొన్నారు. ఈరోజు ఉద‌యం త‌న ఇంటి ద‌గ్గ‌ర అల్లు అర‌వింద్, అల్లు అర్జున్ మొక్క‌లు నాటారు.

అజిత్ తో చేయడానికి నేను సిద్ధం- పవన్ కల్యాణ్

పవర్ స్టార్ పవన్ కల్యాణ్ ఇప్పుడు లండన్ ట్రిప్ నుండి మలేషియాకు చేరుకున్నాడు.