భారీ ధర పలికిన 'బీబీ 3' ఓవర్సీస్ థియేట్రికల్ రైట్స్
Send us your feedback to audioarticles@vaarta.com
నందమూరి బాలకృష్ణ హీరోగా బోయపాటి శ్రీను దర్శకత్వంలో మరో సినిమా తెరకెక్కుతున్న విషయం తెలిసిందే. వీరిద్దరి కాంబోలో మూడో సినిమాగా తెరకెక్కుతున్న ఈ చిత్రం తప్పక హ్యాట్రిక్ కొడుతుందని అభిమానులు భావిస్తున్నారు. దీంతో ఈ చిత్రంపై అంచనాలు భారీగా ఉన్నాయి. ప్రస్తుతం ఈ చిత్రానికి సంబంధించిన షూటింగ్ అన్నపూర్ణ సెవెన్ ఎకర్స్‌లో జరుగుతోంది. ఈ చిత్రం కోసం ప్రత్యేకంగా రూ.రూ.30 లక్షల వ్యయంతో భారీగా ఓ దేవాలయం సెట్‌ను వేశారు. ఈ సెట్‌లోనే నాలుగు రోజులుగా బోయపాటి కీలక సన్నివేశాలను తెరకెక్కిస్తున్నారు. మరో 12 రోజుల పాటు ఇక్కడే షూటింగ్ జరగనుంది.
ఈ నెల 22తో అన్నపూర్ణ సెవెన్ ఎకర్స్‌లో చిత్రీకరణ పూర్తి చేసుకుని... ఈ చిత్రం తదుపరి షెడ్యూల్ కోసం ఏప్రిల్‌లో అవుట్‌డోర్ షూటింగ్ కోసం బెల్గాం వెళ్లనుందని సమాచారం. అయితే ఈ చిత్ర థియేట్రికల్ రైట్స్ భారీ ధరకు అమ్ముడైనట్టు తెలుస్తోంది. ఈ సినిమా థియేట్రికల్ రైట్స్‌ను దిల్ రాజు సొంతం చేసుకున్నట్లు తెలుస్తుంది. ఆంధ్ర రైట్స్ ఇప్పటికే రూ.35 కోట్లు పలకగా.. నైజాం, ఉత్తరాంధ్ర రైట్స్ ను 16 కోట్లకు దిల్ రాజు దక్కించుకున్నాడని చెప్తున్నారు. కాగా. ఓవర్సీస్‌లో కూడా ఈ సినిమా థియేట్రికల్ రైట్స్ భారీ ధరకు అమ్ముడైనట్టు సమాచారం. ఓవర్సీస్‌లో ‘బీబీ 3’ థియేట్రికల్ రైట్స్ రూ.2 కోట్లకు అమ్ముడైనట్టు సమాచారం.
అయితే అన్ని సినిమాల్లో మాదిరిగా ఈ సినిమాలో రెగ్యులర్ డ్యూయెట్స్ ఉండవని సమాచారం. ఇప్పటికి రెండు పాటలు పూర్తయ్యాయనీ, మరో పాట చిత్రీకరించాల్సి ఉందని తెలుస్తోంది. ద్వారకా క్రియేషన్స్ పతాకంపై మిర్యాల రవీందర్ నిర్మిస్తున్నారు. ఈ చిత్రంలో ప్రగ్యా జైస్వాల్ హీరోయిన్‌గా నటిస్తుండగా.. పూర్ణ ప్రతి నాయిక పాత్రను పోషిస్తున్నట్టు తెలుస్తోంది. ఈ చిత్రానికి తమన్ సంగీతం అందిస్తున్నారు. బాలయ్య 106వ సినిమాగా తెరకెక్కుతున్న ఈ సినిమాకు ‘గాడ్ ఫాదర్’ అనే టైటిల్ కూడా ఫిక్స్ అయిందని టాక్ నడుస్తోంది. త్వరలోనే దీనికి సంబంధించిన అధికారిక ప్రకటన వెలువడనుందని ఇండస్ట్రీ వర్గాలు చెబుతున్నాయి.
Follow @ Google News: గూగుల్ న్యూస్ పేజీలోని ఇండియాగ్లిట్జ్ తెలుగు వెబ్‌సైట్‌ను అనుసరించడానికి మరియు వెంటనే వార్తలను తెలుసుకోవడాని ఇక్కడ క్లిక్ చేయండి.
-
Devan Karthik
Contact at support@indiaglitz.com
Comments