‘పుష్ప’ కోసం భారీ ప్లాన్
Send us your feedback to audioarticles@vaarta.com
స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్, విలక్షణ దర్శకుడు సుకుమార్ కాంబినేషన్‌లో రూపొందనున్న చిత్రం ‘పుష్ప’. పాన్ ఇండియా చిత్రంగా తెరకెక్కబోతున్న ఈ సినిమా సెట్స్ పైకి ఎప్పుడో వెళ్లాల్సింది. కానీ.. కరోనా కారణంగా ఆగింది. ప్రభుత్వం 40-50 మంది చిత్రీకరణ చేసుకోవచ్చునని చెప్పినప్పటికీ అంత తక్కువ మందితో అయితే ఈ సినిమాను చిత్రీకరించలేమని చిత్ర యూనిట్ ఇంకా సినిమా షూటింగే స్టార్ట్ చేయలేదట. ఈ సమస్య నుండి బయట పడటానికి మేకర్స్ ఓ ప్లాన్ చేస్తున్నారట. ఓ భారీ షెడ్యూల్‌ను 150-200 మందితో హైదరాబాద్ శివారు ప్రాంతాల్లో షూటింగ్‌ను స్టార్ట్ చేసి వారు వేరు వారితో కలవకుండా, కోవిడ్ పరీక్షలు నిర్వహించి టీమ్‌ను తయారు చేసుకోవాలనుకుంటున్నారట. అలాంటి భారీ ప్లాన్‌కు ప్రభుత్వం అనుమతిని ఇస్తుందా? అనేది సందేహంగా మారింది.
శేషాచల అడవుల్లో జరిగే ఎర్రచందనం స్మగ్లింగ్ నేపథ్యంలో తెరకెక్కబోతున్న ఈ సినిమాలో రష్మిక మందన్న హీరోయిన్‌గా నటిస్తుంది. ‘ఆర్య, ఆర్య2’ చిత్రాల తర్వాత బన్నీ, సుకుమార్ కాంబినేషన్‌లో తెరకెక్కనున్న ఈ చిత్రాన్ని మైత్రీ మూవీ మకర్స్, ముత్తం శెట్టి మీడియా నిర్మిస్తుంది.
Follow @ Google News: గూగుల్ న్యూస్ పేజీలోని ఇండియాగ్లిట్జ్ తెలుగు వెబ్‌సైట్‌ను అనుసరించడానికి మరియు వెంటనే వార్తలను తెలుసుకోవడాని ఇక్కడ క్లిక్ చేయండి.
Comments
- logoutLogout
-
Devan Karthik
Contact at support@indiaglitz.com