‘పుష్ప’ కోసం భారీ ప్లాన్‌

  • IndiaGlitz, [Tuesday,July 07 2020]

స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్‌, విల‌క్ష‌ణ ద‌ర్శ‌కుడు సుకుమార్ కాంబినేష‌న్‌లో రూపొంద‌నున్న చిత్రం ‘పుష్ప’. పాన్ ఇండియా చిత్రంగా తెర‌కెక్క‌బోతున్న ఈ సినిమా సెట్స్ పైకి ఎప్పుడో వెళ్లాల్సింది. కానీ.. క‌రోనా కార‌ణంగా ఆగింది. ప్ర‌భుత్వం 40-50 మంది చిత్రీక‌ర‌ణ చేసుకోవ‌చ్చున‌ని చెప్పిన‌ప్ప‌టికీ అంత త‌క్కువ మందితో అయితే ఈ సినిమాను చిత్రీక‌రించలేమ‌ని చిత్ర యూనిట్ ఇంకా సినిమా షూటింగే స్టార్ట్ చేయ‌లేద‌ట‌. ఈ స‌మ‌స్య నుండి బ‌య‌ట ప‌డ‌టానికి మేక‌ర్స్ ఓ ప్లాన్ చేస్తున్నార‌ట‌. ఓ భారీ షెడ్యూల్‌ను 150-200 మందితో హైద‌రాబాద్ శివారు ప్రాంతాల్లో షూటింగ్‌ను స్టార్ట్ చేసి వారు వేరు వారితో క‌ల‌వ‌కుండా, కోవిడ్ ప‌రీక్ష‌లు నిర్వ‌హించి టీమ్‌ను త‌యారు చేసుకోవాలనుకుంటున్నార‌ట‌. అలాంటి భారీ ప్లాన్‌కు ప్ర‌భుత్వం అనుమ‌తిని ఇస్తుందా? అనేది సందేహంగా మారింది.

శేషాచ‌ల అడ‌వుల్లో జ‌రిగే ఎర్ర‌చంద‌నం స్మ‌గ్లింగ్ నేప‌థ్యంలో తెర‌కెక్క‌బోతున్న ఈ సినిమాలో ర‌ష్మిక మంద‌న్న హీరోయిన్‌గా న‌టిస్తుంది. ‘ఆర్య‌, ఆర్య‌2’ చిత్రాల త‌ర్వాత బ‌న్నీ, సుకుమార్ కాంబినేష‌న్‌లో తెర‌కెక్క‌నున్న ఈ చిత్రాన్ని మైత్రీ మూవీ మ‌క‌ర్స్‌, ముత్తం శెట్టి మీడియా నిర్మిస్తుంది.

More News

మరో సినిమాకు రజినీ సైన్... వచ్చే ఏడాది కూడా పార్టీ లేనట్టేనా?

సూపర్ స్టార్ రజినీకాంత్ రాజకీయ పార్టీ పెట్టడం వచ్చే ఏడాది కూడా జరిగేలా కనిపించడం లేదు.

ప్రభాస్ అభిమానులకు దూరమవుతున్నాడా?

హీరోల్లో ప్రభాస్‌కు ఒక ప్రత్యేక స్థానముంది. కానీ ఈ మధ్య కాలంలో ఆయనను అభిమానులు బాగా మిస్ అవుతున్నారు.

నిమ్స్‌లో జరగాల్సిన కరోనా వ్యాక్సిన్ క్లినికల్ ట్రయల్స్‌కు బ్రేక్

కరోనా వ్యాక్సిన్ క్లినికల్ ట్రయల్స్‌కు బ్రేక్ పడింది. క్లినికల్ ట్రయల్స్‌ను దేశ వ్యాప్తంగా 12 ప్రాంతాల్లో నిర్వహించాలని భారత వైద్య పరిశోధన మండలి(ఐసీఎంఆర్) నిర్ణయించింది.

ఆ డిజాస్టర్ హీరోయిన్‌ను సరికొత్తగా మార్చిన వర్మ..

సంచలన దర్శకుడు రామ్ గోపాల్ వర్మ ఏం చేసినా సంచలనమే. ఆయన సినిమాలకు పైసా ఖర్చు లేకుండా ప్రతి గడపకూ తన సినిమాను చేర్చగల దిట్ట.

‘పవర్ స్టార్’లో వర్మ పవన్‌ను సీఎంని చేస్తారట..

పవన్ కల్యాణ్ బయోపిక్‌ను ‘పవర్ స్టార్’ పేరుతో వర్మ తెరకెక్కించనున్న విషయం తెలిసిందే. దీని కోసం అచ్చం పవన్‌లా ఉండే వ్యక్తిని కూడా వర్మ ఎంపిక చేసుకున్నారు.