నాని 'శ్యామ్ సింగ రాయ్'కి భారీ నష్టం.. ఎంత పని జరిగింది!

  • IndiaGlitz, [Friday,May 21 2021]

కరోనా కారణంగా చిత్ర పరిశ్రమ భారీ నష్టాలు ఎదుర్కొంటోంది. కోట్లాది రూపాలు ఖర్చు చేసి నిర్మించిన చిత్రాలు విడుదలకు నోచుకోకుండా పోయాయి. హీరో నాని చిత్రాలపై కోవిడ్ ఎఫెక్ట్ బాగా పడింది. గత ఏడాది నాని నటించిన 'వి' చిత్రం రిలీజ్ కు రెడీ అవుతున్న టైంలో లాక్ డౌన్ ప్రకటించారు. దీనితో చేసేది లేక ఓటిటి లో రిలీజ్ చేశారు.

ఇదీ చదవండి: హీరోయిన్ న్యూడ్ వీడియో వివాదం.. 'నా డ్రైవర్ కూడా చూశాడు'

ఈ ఏడాది కూడా అదే పరిస్థితి నెలకొంది. నాని నటించిన టక్ జగదీష్ రిలీజ్ కు రెడీ అవుతున్న టైంలో సెకండ్ వేవ్ కేసులు పెరిగిపోయాయి. తాజాగా నాని నటిస్తున్న 'శ్యామ్ సింగ రాయ్' చిత్రానికి తీవ్ర నష్టం వాటిల్లింది.

ఈ చిత్రం కోసం హైదరాబాద్ శివారులో దాదాపు ఆరున్నర కోట్ల ఖర్చుతో నిర్మాతలు భారీ సెట్ నిర్మించారు. దాదాపుగా ఈ చిత్ర షూటింగ్ పూర్తయింది. ఆ సెట్ లో ఇంక కొన్ని రోజుల షూట్ మాత్రమే మిగిలి ఉంది. ఇలాంటి టైంలో కోవిడ్ కేసులు ఎక్కువ కావడంతో షూట్ నిలిచిపోయింది.

కేసులు తగ్గగానే మిగిలిన షూట్ ఫినిష్ చేయాలని చిత్ర యూనిట్ భావించింది. కానీ హైదరాబాద్ లో గత రెండు రోజులుగా కురుస్తున్న వర్షంతో సెట్ బాగా డ్యామేజ్ అయ్యిందట. ఇది నిర్మాతలకు హ్యుజ్ లాస్ అని అంటున్నారు. సెట్ కి మరమ్మతులు చేయడానికి మరో 2 కోట్ల రూపాయలు అదనంగా ఖర్చవుతుందని సమాచారం. దీనితో బడ్జెట్ లో నిర్మాతపై అదనపు భారం పడ్డట్లే.

కోల్ కథ బ్యాక్ డ్రాప్ లో పీరియాడిక్ డ్రామాగా ఈ చిత్రం తెరకెక్కుతోంది. టాక్సీవాలా ఫేమ్ రాహుల్ సాంకృత్యాన్ దర్శకుడు. మిక్కీ జె మేయర్ సంగీతం అందిస్తున్నారు. బోయినపల్లి వెంకట్ ఈ చిత్రాన్ని నిర్మిస్తుండగా.. సాయిపల్లవి, కృతి శెట్టి, మడోనా సెబాస్టియన్ హీరోయిన్లుగా నటిస్తున్నారు.