‘ఉప్పెన’ దర్శకుడికి భారీ గిఫ్ట్ అందజేసిన నిర్మాతలు

  • IndiaGlitz, [Friday,March 26 2021]

లేటుగా వచ్చినా.. లేటెస్ట్‌గా వచ్చి ప్రేక్షకుల హృదయాలను దోచుకుని.. బాక్సాఫీస్‌ను షేక్ చేసిన సినిమా ‘ఉప్పెన'. మెగా మేనల్లుడు పంజా వైష్ణవ్‌, కృతిశెట్టి జంటగా ఈ చిత్రం రూపొందింది. డెబ్యూ దర్శకుడు బుచ్చిబాబు సానా ఈ చిత్రాన్ని తెరకెక్కించారు. ఈ చిత్రం రికార్డుల మీద రికార్డులు కొల్లగొట్టిన విషయం తెలిసిందే. డెబ్యూ హీరోల్లో అత్యధిక వసూళ్లు సాధించిన చిత్రంగా టాలీవుడ్‌లో రామ్ చరణ్ ‘చిరుత’ ఇప్పటి వరకూ ఉంది. ఈ సినిమా ఆ సినిమా రికార్డును సైతం బ్రేక్ చేసింది. ఏ డెబ్యూ హీరోకి రాని వసూళ్లను రాబట్టి ఈ చిత్రంతో వైష్ణవ్ తేజ్ చరిత్ర సృష్టించాడు.

తొలిసారి దర్శకత్వం వహించినప్పటికీ సినిమాను అద్భుతంగా ప్రెజెంట్ చేయడంలో బుచ్చిబాబు సక్సెస్ అయ్యారు. మరోవైపు ఈ సినిమాను కోలీవుడ్‌తో పాటు బాలీవుడ్‌లోకి కూడా రీమేక్‌ చేయడానికి సన్నహాలు మొదలు పెట్టారు. ఇంతటి వసూళ్లను అందించిన చిత్రాన్ని తెరకెక్కించినందుకుగానూ ఈ చిత్ర నిర్మాతలు దర్శకుడు బుచ్చిబాబు సానాకు అద్భుతమైన గిఫ్ట్ అందజేసింది. ముందు హీరో వైష్ణవ్ తేజ్..హీరోయిన్ కృతి శెట్టికి ఖరీదైన గిఫ్ట్స్ అందజేచిన నిర్మాతలు.. తాజాగా దర్శకుడు బుచ్చిబాబు సానాకి ఖరీదైన మెర్సిడిస్ బెంజ్ జీఎల్‌సీ కారును బ‌హుమ‌తిగా ఇచ్చారు.

నిర్మాతలు గిఫ్ట్‌గా ఇచ్చిన కారు విలువ దాదాపు 60 లక్షలకి పైగా ఉంటుందని తెలుస్తోంది. ఇక నిర్మాతల నుంచి కారు కీస్ అందుకున్న బుచ్చిబాబు ముందుగా తన గురువు సుకుమార్‌ను ఎక్కించుకుని హైదరాబాద్‌ రోడ్లపై ఎంజాయ్ చేశారు. ప్రస్తుతం దీనికి సంబంధించిన పిక్స్ సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. కాగా.. బుచ్చిబాబు రెండవ సినిమా సైతం మైత్రీ మూవీస్ వారే నిర్మించనున్నారు. మరోవైపు తన శిష్యుడు ఇంతటి అద్భుతమైన సక్సెస్‌ను సాధించడంతో సుక్కు బాగా ఖుషీ అవుతున్నారు.

More News

సీబీఐ ఎఫ్‌ఆర్‌ఐపై స్పందించిన రఘురామ

వైసీపీ రెబల్ ఎంపీ రఘురామ కృష్ణరాజుపై సీబీఐ ఎఫ్‌ఆర్‌ఐ నమోదు చేసిన విషయం తెలిసిందే. దీనిపై తాజాగా రఘురామ కృష్ణరాజు వివరణ ఇచ్చారు.

అసెంబ్లీలో నవ్వులు పూయించిన మంత్రి మల్లారెడ్డి

ప్రతీచోట సరదాగా మాట్లాడుతూ నవ్వించే వారు ఉంటూనే ఉంటారు. సీరియస్‌గా జరుగుతున్న తెలంగాణ అసెంబ్లీలో మంత్రి చామకూర మల్లారెడ్డి నవ్వుల పువ్వులు పూయించారు.

ఎంపీ రఘురామకృష్ణంరాజుపై సీబీఐ కేసు

వైసీపీ రెబల్ ఎంపీ రఘురామకృష్ణంరాజుపై సీబీఐ ఎఫ్‌ఐఆర్‌ నమోదు చేసింది.

కర్నూలు ఎయిర్‌పోర్టుకు ఉయ్యాలవాడ పేరు.. స్పందించిన చిరు

ప్రముఖ స్వాతంత్ర్య సమరయోధులు ఉయ్యాలవాడ నరసింహారెడ్డి పేరును కర్నూలు జిల్లాలోని ఓర్వకల్లు ఎయిర్‌పోర్టుకు పెట్టిన విషయం తెలిసిందే. నేడు కర్నూలు జిల్లా ఓర్వకల్లు ఎయిర్‌పోర్టును సీఎం జగన్ ప్రారంభించారు.

న‌న్ను మించి 'రంగ్ దే' క‌థ‌ను నితిన్‌, కీర్తి సురేష్ ఎక్కువ‌గా న‌మ్మారు - డైరెక్ట‌ర్ వెంకీ అట్లూరి

'తొలిప్రేమ'‌, 'మిస్ట‌ర్ మ‌జ్ను' చిత్రాల త‌ర్వాత వెంకీ అట్లూరి ద‌ర్శ‌క‌త్వం వ‌హించిన మూడో చిత్రం 'రంగ్ దే'.