ఎయిర్ షో లో అగ్నిప్రమాదం.. 300 కార్లు బుగ్గి
Send us your feedback to audioarticles@vaarta.com
బెంగళూరులోని యలహంకలో రిహార్సల్స్ చేస్తున్న రెండు రెండు సూర్యకిరణ్ విమానాలు కుప్పకూలిన ఘటన మరువక ముందే మరో భారీ అగ్నిప్రమాదం చోటుచేసుకుంది. బెంగళూరులో ప్రతిష్టాత్మకంగా జరుగుతున్న ఏరో ఇండియా షో-2019లో శనివారం నాడు భారీ అగ్నిప్రమాదం సంభవించింది. ఈ ప్రదర్శనను చూసేందుకు వచ్చిన సందర్శకుల వాహనాలకు యలహంక ఎయిర్‌బేస్ స్టేషన్ సమీపంలో పార్కింగ్ ఏర్పాటు చేశారు. అయితే వారాంతం కావడంతో ఈ ప్రదర్శనను తిలకించేందుకు ఊహించనంత మంది తరలివచ్చారు. దీంతో పార్కింగ్ ప్రదేశం మొత్తం కార్లు, ద్విచక్రవాహనాలతో నిండిపోయింది. దీంతో ప్రమాదం ఎలా జరిగిందో తెలియరాలేదు గానీ ఒక్కసారిగా మంటలు చెలరేగాయి. పక్కపక్కనే ఉన్న కార్లు ఒక్కొక్కటిగా తగలబడుతూ సుమారు 300కు పైగా వాహనాలు కాలి బూడిదవ్వగా మరికొన్ని వాహనాలు పాక్షికంగా దెబ్బతిన్నాయి.
కారణాలేంటి..?
కాగా.. ఈ ఘటన మధ్యాహ్నం 1గంట ప్రాంతంలో చోటు చేసుకున్నట్లు సమాచారం. కార్లలోని ఇందనం తోడవ్వడంతో ఒక్కసారి మంటలు వ్యాపించాయి. స్థానిక సమాచారం మేరకు ఘటనాస్థలికి చేరుకున్న ఫైరింగ్ సిబ్బంది, పోలీసులు మంటలు ఆర్పేందుకు ప్రయత్నాలు చేస్తున్నారు. అయితే గంటల తరబడి ఫైరింగ్ సిబ్బంది ఎగసిపడుతున్న మంటలను ఆర్పేందుకు ప్రయత్నాలు చేస్తోంది. మొత్తం 15 ఫైరింజన్లతో మంటలు అదుపులోకి తెచ్చేందుకు ప్రతయత్నాలు చేస్తున్నారు. అయితే ఈ ఘటన ఎలా చోటుచేసుకుంది..? దీనికి కారణం ఎవరు..? ప్రమాదం ఆకస్మాతుగా జరిగిందా..? ఎవరైనా పనిగట్టుని ఇలా చేశారా..? అనే విషయం తెలియరాలేదు. కాగా ఈ ఘటనకు సంబంధించి మరింత సమాచారం తెలియాల్సి ఉంది.
Follow @ Google News: గూగుల్ న్యూస్ పేజీలోని ఇండియాగ్లిట్జ్ తెలుగు వెబ్‌సైట్‌ను అనుసరించడానికి మరియు వెంటనే వార్తలను తెలుసుకోవడాని ఇక్కడ క్లిక్ చేయండి.
Comments
- logoutLogout