అమెరికాలోనూ మంత్రి నారా లోకేష్ కు అభిమానుల తాకిడి!

  • IndiaGlitz, [Sunday,October 27 2024]

ఓ వైపు ఇన్వెస్టర్స్ తో వరుస భేటీలు... మరో వైపు పార్టీ కేడర్ తో ఫోటోలు

శాన్ ఫ్రాన్సిస్కో: పెట్టుబడుల సాధన కోసం అమెరికా వెళ్లిన రాష్ట్ర విద్య, ఐటి, ఎలక్ట్రానిక్స్ శాఖల మంత్రి నారా లోకేష్ కు అక్కడ కూడా అభిమానుల తాకిడి తప్పలేదు.

శాన్ ఫ్రాన్సిస్కోలో ఒకవైపు పారిశ్రామికవేత్తలతో వరుస భేటీలతో క్షణం తీరికలేకుండా బిజీబిజీగా ఉంటూనే... మరోవైపు తమను కలిసేందుకు వచ్చిన అభిమానులను నిరాశపర్చకుండా ఫోటోలు దిగారు.

శాన్ ఫ్రాన్సిస్కోలో మంత్రి బసచేసిన ఫోర్ సీజన్స్ హోటల్ వద్దకు వచ్చిన సుమారు 200 మంది పార్టీ కార్యకర్తలు, అభిమానులతో ఫోటోలు దిగిన లోకేష్ వారిని ఆప్యాయంగా పలకరించి వారి సాధకబాధకాలను తెలుసుకున్నారు.

ఇదిలావుండగా 2వరోజు మంత్రి లోకేష్ పలువురు పారిశ్రామికవేత్తలతో ముఖాముఖి సమావేశమై రాష్ట్రంలో పెట్టుబడులు పెట్టాల్సిందిగా కోరారు.

గూగుల్ సిటిఓ ప్రభాకర్ రాఘవన్, జనరల్ అటమిక్స్ సిఇఓ డాక్టర్ వివేక్ లాల్, నియోట్రైబ్ వెంచర్స్ ఫౌండర్ కిట్టూ కొల్లూరి, జనరల్ కేటలిస్ట్స్ ఎండి నీరజ్ అరోరా, ఐ స్పేస్ ప్రెసిడెంట్ రాజేష్ కొత్తపల్లి, సిఎఫ్ఓ ప్రసాద్ పాపుదేసి, గూగుల్ మాజీ అధికారి సారిన్ సువర్ణ, స్మియోటా కంపెనీ ప్రతినిధులతో మంత్రి లోకేష్ వన్ టు వన్ భేటీ అయ్యారు.

రాష్ట్రంలో కొత్తగా తెచ్చిన పారిశ్రామిక పాలసీలు, ప్రోత్సాహకాలను మంత్రి లోకేష్ వారికి వివరించారు.

More News

శాన్ ఫ్రాన్సిస్కోలో మంత్రి లోకేష్ కు అపూర్వ స్వాగతం

శాన్ ఫ్రాన్సిస్కో (యూఎస్ఏ): పెట్టుబడుల ఆకర్షణే లక్ష్యంగా అమెరికాలోని శాన్ ఫ్రాన్సిస్కో నగరానికి చేరుకున్న రాష్ట్ర విద్య, ఐటి, ఎలక్ట్రానిక్స్ శాఖల మంత్రి నారా లోకేష్ కు

తనికెళ్ళ భరణి సన్మాన వేడుక.. ఆకట్టుకునేలా రామ్ గోపాల్ వర్మ, పురాణపండ స్పీచ్

తనికెళ్ళ భరణి.. కేవలం తెలుగు సినిమా పరిశ్రమలో కేవలం నటుడిగా మాత్రమే కాకుండా రచయితగా, దర్శకుడిగా సుపరిచితులు.

'పేకమేడలు' రిలీజ్ టైంలో చాలా ఇబ్బంది పడ్డాం కానీ... : సక్సెస్ మీట్ లో రాకేష్ వర్రే ఎమోషనల్

క్రేజీ యాంట్స్ ప్రొడక్షన్స్ సంస్థ నుంచి రాకేష్ వర్రే నిర్మాతగా వినోద్ కిషన్ హీరో గా అనూష కృష్ణ హీరోయిన్ గా నీలగిరి మామిళ్ల దర్శకత్వంలో వచ్చిన సినిమా పేక మేడలు.

Bahishkarana:అంజలి ప్రధాన పాత్రలో 'బహిష్కరణ' జూలై 19న ZEE 5

యాబైకి పైగా చిత్రాల్లో హీరోయిన్‌గా, విలక్షణ పాత్రల్లో మెప్పించిన నటి అంజలి. తాజాగా ఆమె ప్రధాన పాత్రలో ZEE 5,

Rautu Ka Raaz:న‌వాజుద్దీన్ సిద్ధిఖీ పోలీస్ ఆఫీస‌ర్ పాత్ర‌లో ‘రౌతు కా రాజ్’ZEE5లో ఆస‌క్తిని రేకెత్తిస్తోన్న మ‌ర్డ‌ర్ ఇన్వెస్టిగేటివ్ థ్రిల్ల‌ర్

ఇండియాలో అతి పెద్ద‌దైన ఓటీటీ ఫ్లాట్ ఫామ్ ZEE5. ఎప్ప‌టిక‌ప్పుడు ప్రేక్ష‌కుల‌కు స‌రికొత్త ఎంట‌ర్‌టైన్‌మెంట్‌ను