Ntr100 Rupees:ఎన్టీఆర్ రూ.100 నాణెం కోసం ఫ్యాన్స్ క్యూ.. వేల కాయిన్స్ సేల్, మరిన్ని ముద్రించే పనిలో సర్కార్
Send us your feedback to audioarticles@vaarta.com
టీడీపీ వ్యవస్థాపకులు, మాజీ ముఖ్యమంత్రి స్వర్గీయ నందమూరి తారక రామారావు శత జయంతి సందర్భంగా కేంద్ర ప్రభుత్వం ఆయన సంస్మరణార్ధం రూ.100 నాణెం ముద్రించిన సంగతి తెలిసిందే. సోమవారం ఢిల్లీలో జరిగిన కార్యక్రమంలో రాష్ట్రపతి ద్రౌపది ముర్ము నాణెం విడుదల చేశారు. అయితే ఈ నాణెం కోసం ఎన్టీఆర్ అభిమానులు క్యూకడుతున్నారు. ఎన్టీఆర్ ముఖ చిత్రంతో రూపొందించిన రూ.100 నాణెంను మూడు ధరల్లో మింట్ అధికారులు విక్రయిస్తున్నారు. రూ.4,850.. రూ. 4,380..రూ.4,050గా నాణెం అందుబాటులో వుంది. దీనిని కొనుగోలు చేసేందుకు సైఫాబాద్‌లోని మింట్ మ్యూజియానికి ఎన్టీఆర్ అభిమానులు భారీగా క్యూ కట్టారు. ప్రస్తుతానికి 12,000 నాణేలను ముద్రించామని, డిమాండ్‌ను బట్టి మరిన్ని తయారు చేస్తామని ప్రభుత్వం పేర్కొంది.
ఎన్టీఆర్ రూ.100 కాయిన్ ఎలా పొందాలి :
ఎన్టీఆర్ స్మారక నాణెం తయారీకి ప్రభుత్వానికి రూ.4 వేల వరకు ఖర్చవుతుందని అధికారులు తెలిపారు. ఈ నాణెం మార్కెట్‌లో చెలామణిలో వుండదు, కేవలం వారి గుర్తుగా దాచుకోవడానికి మాత్రమే వీలుంటుంది. ఎన్టీఆర్ స్మారక నాణెం కావాలనుకునేవారు ఆన్‌లైన్‌తో పాటు హైదరాబాద్‌లోని సచివాలయం పక్కనే వున్న మింట్ కాంపౌండ్, చర్లపల్లి మింట్, మింట్ మ్యూజియంల వద్ద వీటిని అమ్మకానికి పెట్టారు.
ఎన్టీఆర్ నాణెం ఇలా :
కాగా.. రూ.100 ఎన్టీఆర్ నాణెం విషయానికి వస్తే 44 మిల్లీమీటర్ల చుట్టుకొలతతో రూపొందించారు. 50 శాతం వెండి, 40 శాతం రాగి, 5 శాతం నికెల్ , 5 శాతం జింక్‌తో తయారు చేశారు. ఎన్టీఆర్ నాణేనికి ఓ వైపు భారత ప్రభుత్వ చిహ్నాం మూడు సింహాలు, అశోక చక్రం వుండగా.. మరోవైపు ఎన్టీఆర్ చిత్రం, దానికి నందమూరి తారక రామారావు శతజయంతి అని హిందీలో వ్రాశారు. అన్నగారి శతజయంతి ఈ ఏడాదితో ముగిసింది. అందుకే నాణెంపై 1923-2023 అని ప్రభుత్వం ముద్రించింది.
Follow @ Google News: గూగుల్ న్యూస్ పేజీలోని ఇండియాగ్లిట్జ్ తెలుగు వెబ్‌సైట్‌ను అనుసరించడానికి మరియు వెంటనే వార్తలను తెలుసుకోవడాని ఇక్కడ క్లిక్ చేయండి.
Comments