Ntr100 Rupees:ఎన్టీఆర్ రూ.100 నాణెం కోసం ఫ్యాన్స్ క్యూ.. వేల కాయిన్స్ సేల్, మరిన్ని ముద్రించే పనిలో సర్కార్

  • IndiaGlitz, [Wednesday,August 30 2023]

టీడీపీ వ్యవస్థాపకులు, మాజీ ముఖ్యమంత్రి స్వర్గీయ నందమూరి తారక రామారావు శత జయంతి సందర్భంగా కేంద్ర ప్రభుత్వం ఆయన సంస్మరణార్ధం రూ.100 నాణెం ముద్రించిన సంగతి తెలిసిందే. సోమవారం ఢిల్లీలో జరిగిన కార్యక్రమంలో రాష్ట్రపతి ద్రౌపది ముర్ము నాణెం విడుదల చేశారు. అయితే ఈ నాణెం కోసం ఎన్టీఆర్ అభిమానులు క్యూకడుతున్నారు. ఎన్టీఆర్ ముఖ చిత్రంతో రూపొందించిన రూ.100 నాణెంను మూడు ధరల్లో మింట్ అధికారులు విక్రయిస్తున్నారు. రూ.4,850.. రూ. 4,380..రూ.4,050గా నాణెం అందుబాటులో వుంది. దీనిని కొనుగోలు చేసేందుకు సైఫాబాద్‌లోని మింట్ మ్యూజియానికి ఎన్టీఆర్ అభిమానులు భారీగా క్యూ కట్టారు. ప్రస్తుతానికి 12,000 నాణేలను ముద్రించామని, డిమాండ్‌ను బట్టి మరిన్ని తయారు చేస్తామని ప్రభుత్వం పేర్కొంది.

ఎన్టీఆర్ రూ.100 కాయిన్ ఎలా పొందాలి :

ఎన్టీఆర్ స్మారక నాణెం తయారీకి ప్రభుత్వానికి రూ.4 వేల వరకు ఖర్చవుతుందని అధికారులు తెలిపారు. ఈ నాణెం మార్కెట్‌లో చెలామణిలో వుండదు, కేవలం వారి గుర్తుగా దాచుకోవడానికి మాత్రమే వీలుంటుంది. ఎన్టీఆర్ స్మారక నాణెం కావాలనుకునేవారు ఆన్‌లైన్‌తో పాటు హైదరాబాద్‌లోని సచివాలయం పక్కనే వున్న మింట్ కాంపౌండ్, చర్లపల్లి మింట్, మింట్ మ్యూజియంల వద్ద వీటిని అమ్మకానికి పెట్టారు.

ఎన్టీఆర్ నాణెం ఇలా :

కాగా.. రూ.100 ఎన్టీఆర్ నాణెం విషయానికి వస్తే 44 మిల్లీమీటర్ల చుట్టుకొలతతో రూపొందించారు. 50 శాతం వెండి, 40 శాతం రాగి, 5 శాతం నికెల్ , 5 శాతం జింక్‌తో తయారు చేశారు. ఎన్టీఆర్ నాణేనికి ఓ వైపు భారత ప్రభుత్వ చిహ్నాం మూడు సింహాలు, అశోక చక్రం వుండగా.. మరోవైపు ఎన్టీఆర్ చిత్రం, దానికి నందమూరి తారక రామారావు శతజయంతి అని హిందీలో వ్రాశారు. అన్నగారి శతజయంతి ఈ ఏడాదితో ముగిసింది. అందుకే నాణెంపై 1923-2023 అని ప్రభుత్వం ముద్రించింది.

More News

Gas:దేశ ప్రజలకు ‘‘రక్షాబంధన్ ’’ కానుక.. గ్యాస్ సిలిండర్ ధర భారీగా తగ్గింపు, కేంద్రం ప్రకటన

పేద, మధ్య తరగతి ప్రజలకు కేంద్ర ప్రభుత్వం రక్షా బంధన్ కానుక ఇచ్చింది. ఇంటి అవసరాల కోసం ఉపయోగించే సిలిండర్‌పై రూ.200 చొప్పున తగ్గించింది.

Pawan kalyan : పవన్ కళ్యాణ్ బర్త్ డే.. జనసేన వినూత్నం, ఐదు సేవా కార్యక్రమాలకు పిలుపు

జనసేన అధినేత , సినీనటుడు పవన్ కల్యాణ్ పుట్టినరోజంటే అభిమానులకు పండుగ రోజు. పవన్ అన్న పేరే ప్రభంజనం,

Family Dhamaka:ఫ్యామిలీ ధమాకా.. ఇది దాస్ కా ఇలాఖా : విశ్వక్‌సేన్ హోస్ట్‌‌గా ఆహాలో రియాలిటీ షో, స్ట్రీమింగ్ ఎప్పుడంటే..?

ప్రస్తుతం ఓటీటీ మార్కెట్ బాగా విస్తరిస్తోంది. సీనియర్ హీరో హీరోయిన్లు , నటుడు, ప్రతిభావంతులకు ఈ పరిశ్రమ అవకాశాలు కల్పిస్తోంది.

Phone ban: ఏపీ ప్రభుత్వం సంచలన నిర్ణయం .. స్కూళ్లలో మొబైల్ ఫోన్లపై నిషేధం

సమాచార మార్పిడి కోసం అందుబాటులోకి వచ్చిన సెల్‌ఫోన్ ప్రస్తుతం మనిషి నిత్య జీవితంలో భాగమైన సంగతి తెలిసిందే.

NTR100 Rupees Coin:రూ.100 ఎన్టీఆర్ నాణెం విడుదల .. ఢిల్లీ ఘనంగా కార్యక్రమం, హాజరైన అన్నగారి కుటుంబం

టీడీపీ వ్యవస్థాపకులు, ఆంధ్రప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి స్వర్గీయ నందమూరి తారక రామారావు శతజయంతి ఉత్సవాల సందర్భంగా