ఓట్ల పండక్కి కిక్కిరిసిన పోయిన బస్సులు, రైళ్లు

  • IndiaGlitz, [Wednesday,April 10 2019]

ఓట్ల పండగ రావడంతో ప్రజలు తమ సొంతూళ్లకు చేరుకుంటున్నారు. ఈ నెల 11న పోలింగ్ ఉండడంతో ఓటేసేందుకు జనాలు పయనమయ్యారు. దీంతో రైల్వే స్టేషన్లు, బస్ స్టాప్ లు కిక్కిరిసిపోయాయి. అయితే, ఈ వాహనాలతో భారీగా ట్రాఫిక్ జాం అయ్యింది. టోల్ ప్లాజాల వద్ద వాహనాలు కిలోమీటర్ల కొద్దీ బారులు తీరాయి. హైదరాబాద్- విజయవాడ జాతీయ రహదారిపై తీవ్ర ఉద్రిక్త పరిస్థితి ఏర్పడింది. యాదాద్రి జిల్లాలోని చౌటుప్పల్ మండలం పంతంగి టోల్ ప్లాజా దగ్గర ట్రాఫిక్ జామైంది. దీంతో టోల్ ప్లాజా వద్ద కనుచూపు మేరలో వాహనాలు నిలిచిపోయాయి. రహదారులు ఎక్కడ చూసినా వాహనాలతో బారులు తీరి దర్శనిమిస్తున్నాయి.

ఇదే అదునుగా కొన్ని ప్రైవేటు ట్రావెల్స్ ప్రయాణికుల అవసరాలను సొమ్ము చేసుకునే పనిలో పడ్డాయి. టికెట్ రెట్లను ఒక్కసారిగి రెట్టింపు చేశారు. దీంతో ప్యాసెంజర్స్ జెబులు ఖాళీ అవుతున్నాయి. ట్రాఫిక్ ఎక్కువగా ఉన్నప్పుడు టోల్ ఫీజు వసూలు నిలిపివేయాలని పలు చోట్ల టోల్ ప్లాజా నిర్వాహకులతో ప్రయాణీకులు వాగ్వాదానికి దిగారు. కాగా ఫుల్ రష్ ఉండడంతో అదనపు ఆర్టీసీ బస్సులను నడుపుతున్నాయి రెండు తెలుగు రాష్ట్రాలు. అదేవిధంగా పలు రైళ్లకు మరిన్ని బోగీలను అటాచ్ చేస్తున్నారు.

అయితే అభ్యర్ధులు సైతం ఓటర్లను తమ వైపుకు తిప్పుకునేందుకు వారి ప్రయాణ ఖర్చలతో పాటు మరిన్ని ఆఫర్లు ఇస్తున్నట్లు తెలుస్తోంది. ఎన్నికల్లో గెలవడానికి వారి పాట్లు వారు పడుతున్నారు. ఏదిఏమైన ఈ సారి ఓటరు చైతన్యం వెల్లువిరిస్తుంది. సంక్రాంతి పండుగను తలపించేలా రైల్వే స్టేషన్లు, బస్ స్టేషన్లు నిండిపోయాయి. ఇప్పటికే ఇరు రాష్ట్రాల్లో అన్ని సంస్థలకు రేపు హాలీడే ప్రకటించారు. మరి ఓటర్లు ఎవరకి జై కోడతారో వెయిట్ అండ్ సీ

More News

ఉన్న‌ట్టా... లేన‌ట్టా...

నాగ‌శౌర్య హీరోగా మొద‌లైన ఓ చిత్రం ఆగిపోయింద‌ని వార్త‌లు వ‌స్తున్నాయి.

విజ‌య్ ఎమోష‌న‌ల్

విజ‌య్ దేవ‌ర‌కొండ లేటెస్ట్ గా ఓ సినిమాకు సంత‌కం చేసిన‌ట్టు తెలుస్తోంది. ఈ సినిమా ఎమోష‌న‌ల్‌గా సాగుతుంద‌ట‌.

జగన్ అంటే వ్యక్తిగతంగా కోపాల్లేవ్..: పవన్

వైసీపీ అధినేత వైఎస్ జగన్ మోహన్ రెడ్డి అంటే తనకు వ్యక్తిగతంగా కోపాల్లేవ్.. కక్షల్లేవ్ అని జనసేన అధినేత పవన్ కల్యాణ్ చెప్పుకొచ్చారు.

టీడీపీకి ఓటేయండి..: హీరోయిన్ సమంత

ఇదేంటి టైటిల్ చూడగానే షాకయ్యారా..? అవును మీరు వింటున్నది నిజమే. అదేంటి అక్కినేని ఫ్యామిలీ వైసీపీలో ఉందిగా మళ్లీ ఈ సడన్ ట్విస్ట్ ఏంటని అనుకుంటున్నారేమో..

57 బహిరంగ సభల్లో పాల్గొన్న పవన్

తెలుగు రాష్ట్రాల్లో ఎన్నికల నోటిఫికేషన్ విడుదలైంది మొదలుకుని నేటి వరకూ ప్రధాన పార్టీల అధినేతలు, ఎమ్మెల్యే, ఎంపీ అభ్యర్థులు ప్రచారంలో మునిగితేలారు.