యాక్షన్ కోసం అంత ఖర్చా..
Send us your feedback to audioarticles@vaarta.com
సాధారణంగా అక్కినేని నాగార్జున నిర్మాతగా సినిమాలను ఓ పరిమిత బడ్జెట్లో, మంచి కథతో తీయాలనుకుంటాడు. ఇప్పటి వరకు ఫాలో అయిన ఫార్ములా కూడా అదే. అయితే ఈసారి మాత్రం తనయుడు అఖిల్ సినిమా కోసం భారీగానే ఖర్చు పెడుతున్నాడట నాగార్జున. అఖిల్ హీరోగా మనం, 24 చిత్రాల దర్శకుడు విక్రమ్ కుమార్ దర్శకత్వంలో ఓ సినిమా రూపొందుతోన్న సంగతి తెలిసిందే.
అల్రెడి మొదటి షెడ్యూల్ పూర్తయ్యింది. ఈ షెడ్యూల్లో యాక్షన్ పార్ట్ అంతా పూర్తయ్యింది. ఈ యాక్షన్ సన్నివేశాల కోసం 12 కోట్లు ఖర్చు అయ్యాయట. తదుపరి షెడ్యూల్ హైదరాబాద్లో ఈ నెల 12నుండి ప్రారంభం అవుతుందని సమాచారం. ఈ సినిమాలో హీరోయిన్ ఎవరనేది ఇంకా ఫైనలైజ్ కాలేదు. తర్వలోనే హీరోయిన్ ఎవరనే దానిపై ఓ క్లారిటీ వచ్చేస్తుంది.
Follow @ Google News: గూగుల్ న్యూస్ పేజీలోని ఇండియాగ్లిట్జ్ తెలుగు వెబ్సైట్ను అనుసరించడానికి మరియు వెంటనే వార్తలను తెలుసుకోవడాని ఇక్కడ క్లిక్ చేయండి.
Comments