అమెరికాలో తెలుగు సినిమాలకు కనకవర్షం...!
- IndiaGlitz, [Wednesday,January 18 2017]
మన దేశంలోను, అమెరికాలోను హిందీ సినిమాలకే ఎక్కువ కలెక్షన్స్ వస్తుంటాయి. ఇంగ్లీషు చిత్రాలకు దీటుగా హిందీ చిత్రాలు అమెరికాలో కలెక్షన్స్ వసూలు చేస్తుంటాయి. అయితే...అమెరికాలో సంక్రాంతికి రిలీజైన తెలుగు సినిమాలు ఖైదీ నెం 150, గౌతమీపుత్ర శాతకర్ణి, శతమానం భవతి చిత్రాలు రికార్డ్ స్ధాయి కలెక్షన్స్ వసూలు చేస్తుండడం విశేషం. మెగాస్టార్ చిరంజీవి నటించిన ఖైదీ నెం 150 చిత్రం ఫస్ట్ డేనే 1 మిలియన్ మార్క్ అందుకుని సెన్సేషన్ క్రియేట్ చేసింది. సోమవారం $ 63,403 డాలర్లు వసూలు చేసింది. టోటల్ గా ఇప్పటి వరకు $ 2,173,337 డాలర్లు అంటే 14.77 కోట్లు కలెక్ట్ చేసి 2.5 మిలియన్స్ సాధించే దిశగా సక్సెస్ ఫుల్ గా రన్ అవుతుంది.
ఇక బాలకృష్ణ నటించిన 100వ చిత్రం గౌతమీపుత్ర శాతకర్ణి. ఈ చిత్రం సోమవారం$ 90,351 డాలర్లు వసూలు చేసింది. టోటల్ గా $ 1,364,211డాలర్స్ అంటే 9.27 కోట్లు కలెక్ట్ చేసింది. ఓవర్ సీస్ లో ఈ చిత్రానికి అనూహ్యమైన స్పందన రావడంతో బాలకృష్ణ యు.ఎస్ లో సక్సెస్ టూర్ ప్లాన్ చేసారు. ఇక మెగాస్టార్ చిరంజీవి ఖైదీ నెం 150, బాలకృష్ణ గౌతమీపుత్ర శాతకర్ణి ఈ రెండు భారీ చిత్రాల మధ్య రిలీజైన మరో సినిమా శతమానం భవతి. శర్వానంద్, అనుపమ పరమేశ్వరన్ జంటగా వేగేశ్న సతీష్ దర్శకత్వంలో దిల్ రాజు ఈ చిత్రాన్ని నిర్మించారు. ఈ చిత్రం సోమవారం $ 59,274 డాలర్లు వసూలు చేసింది. ఇప్పటి వరకు $ 478,270 డాలర్లు అంటే 3.25 కోట్లు కలెక్ట్ చేసింది. ఇలా...సంక్రాంతికి రిలీజైన తెలుగు సినిమాలు అమెరికాలో కనకవర్షం కురిపిస్తుండడం విశేషం.