డిక్టేటర్ కి అంత డిమాండా..
Send us your feedback to audioarticles@vaarta.com
నందమూరి నట సింహం బాలక్రిష్ణ నటిస్తున్నతాజా చిత్రం డిక్టేటర్. ఈ చిత్రం శ్రీవాస్ దర్శకత్వంలో రూపొందుతుంది. ఈరోస్ ఇంటర్నేషనల్ సంస్థ, డైరెక్టర్ శ్రీవాస్ తో కలసి ఈ చిత్రాన్నినిర్మిస్తుంది. బాలయ్య సరసన అంజలి, సోనాలి చౌహాన్, అక్ష నటిస్తున్నారు. దాదాపు టాకీ పార్ట్ పూర్తయ్యింది. ఇక అసలు విషయానికి వస్తే...డిక్టేటర్ మూవీకి అన్ని ఏరియాల్లో మంచి క్రేజ్ ఉంది.
ప్రస్తుతం డిస్ట్రిబ్యూటర్స్ చెబుతున్నరేటును బట్టి డిక్టేటర్ కి దాదాపు 40 కోట్లు బిజినెస్ జరుగుతుందట. సీనియర్ హీరోల సినిమాలకు 30 నుంచి 35 కోట్లు బిజినెస్ జరుగుతుంది. ఇప్పుడు బాలయ్య డిక్టేటర్ కి 40 కోట్లు బిజినెస్ జరుగుతుండడం విశేషం. సంక్రాంతి కానుకగా డిక్టేటర్ ని జనవరి 14న రిలీజ్ చేయడానికి ప్లాన్ చేస్తున్నారు. మరి..రిలీజ్ కి ముందు 40 కోట్లు బిజినెస్ తో సన్సేషన్ క్రియేట్ చేసిన బాలయ్య రిలీజ్ తర్వాత ఎంత వసూలు చేస్తాడో..? ఎలాంటి సెన్సేషన్ క్రియేట్ చేస్తాడో చూడాలి.
Follow @ Google News: గూగుల్ న్యూస్ పేజీలోని ఇండియాగ్లిట్జ్ తెలుగు వెబ్సైట్ను అనుసరించడానికి మరియు వెంటనే వార్తలను తెలుసుకోవడాని ఇక్కడ క్లిక్ చేయండి.
Comments
- logoutLogout
-
Contact at support@indiaglitz.com